Skip to content
వినోదం వార్తలు

విక్టరీ వెంకటేష్‌ కొత్త సినిమా టైటిల్‌‘జనవరి 12 విడుదల’

Prajapaksham 20 Aug 2026 0 నిమిషాల పఠనం వినోదం
విక్టరీ వెంకటేష్‌ కొత్త సినిమా టైటిల్‌‘జనవరి 12 విడుదల’

Venkatesh

విక్టరీ వెంకటేష్‌, నందమూరి కళ్యాణ్‌ రామ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌, శ్రీమతి అర్చన, జి స్టూడియోస్‌ సమర్పిస్తున్నాయి. వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌ ఫస్ట్‌ లుక్స్‌ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచగా, తాజాగా మేకర్స్‌ టైటిల్‌ను రివీల్‌ చేశారు. ఇప్పటివరకు వర్కింగ్‌ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. అనిల్‌ రావిపూడి మార్క్‌ ఫన్‌తో రూపొందించిన వీడియో ద్వారా టైటిల్‌ను అనౌన్స్‌ చేశారు.టైటిల్‌ అనౌన్స్మెంట్‌ వీడియోను లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ట్రిబ్యూట్‌ ఇస్తూ, ఆయన తెరకెక్కించిన ‘అప్పుల అప్పారావు’లోని ఓ పాపులర్‌ కామెడీ సీక్వెన్స్ను గుర్తు చేసేలా మొదలుపెట్టారు. ఇవివి సత్యనారాయణ అనిల్‌ రావిపూడికి ఎంతటి ఇన్స్పిరేషన్‌ అనేది తెలిసిందే. వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌, కీర్తి సురేష్‌, కృతి శెట్టి కలిసి అనిల్‌ రావిపూడి దగ్గరకు వెళ్లి సినిమా టైటిల్‌ ఏంటని అడుగుతారు. వెంటనే అనిల్‌ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ అని చెప్పడంతో వాళ్లంతా కన్ఫ్యూజ్‌ అవుతారు. ఆ తర్వాత జరిగే ఫన్ఫుల్‌ కన్వర్జేషన్‌, కామెడీ బాంటర్తో వీడియో ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. చివరికి ‘జనవరి 12 విడుదల’ నే సినిమా టైటిల్‌ అని రివీల్‌ చేయడం ఆకట్టుకుంది. 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తుండగా, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్గా పనిచేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఏఎస్‌ ప్రకాష్‌ సినిమా కోసం గ్రాండ్‌ విజువల్‌ వరల్డ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఎస్‌. కృష్ణ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్‌, నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కీర్తి సురేష్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్‌లుగా నటిసున్నారు.