Skip to content
వినోదం వార్తలు

చిరంజీవి 158వ సినిమా

Prajapaksham 20 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
చిరంజీవి 158వ సినిమా

Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి చిరంజీవి 158 చేస్తున్నారు. ఈ సినిమాను కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాబీ కొల్లి తన విజన్ను తెరపైకి తీసుకురావడానికి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా షూటింగ్‌ 40 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ దాదాపుగా పూర్తయింది. ఇప్పటివరకు తీసిన ఔట్పుట్‌ అద్భుతంగా వచ్చింది. కథలో ఇంటెన్సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, యాక్షన్‌ అన్నీ సరైన బ్యాలెన్‌ ఉండేలా సినిమా రూపొందుతోంది. ఇటీవల షూట్‌ చేసిన ఇంటర్వెల్‌ ఫైట్‌ సినిమాకు మరో ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. భారీ స్థాయిలో డిజైన్‌ చేసి తెరకెక్కించిన ఈ యాక్షన్‌ బ్లాక్‌ ఫస్ట్‌ హాఫ్కు పవర్ఫుల్‌ హైలైట్‌గా ఉండబోతోంది. చిరంజీవి స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు బాబీ కొల్లి మార్క్‌ మాస్‌ ఎలివేషన్స్‌ తోడవడంతో ఈ ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ థియేటర్లలో గూస్బంప్స్‌ తెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది.ఆగస్టు 22న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా భారీ అప్డేట్‌ ఇచ్చేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు. ఈ స్పెషల్‌ అప్డేట్‌ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ స్మూత్‌గా కొనసాగుతుండటంతో పాటు ఫస్ట్‌ హాఫ్‌ ఎడిట్‌ కూడా దాదాపు పూర్తవ్వడంతో ప్రొడక్షన్‌ నెకస్ట్‌ ఫేజ్లోకి వెళ్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంగీతం అందిస్తుండగా, విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ సినిమాటోగ్రఫీ, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైన్‌, ఆంటోనీ ఎల్‌. రూబెన్‌ ఎడిటింగ్‌. కోన వెంకట్‌, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ పే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్‌ పొట్లూరి అడిషినల్‌ స్క్రీన్‌ ప్లే రైటర్స్గా పనిచేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్‌ రాస్తున్నారు. ఈచిత్రానికి సంగీతం: థమన్‌ ఎస్‌, స్క్రీన్‌ ప్లే రైటర్స్‌: కోన వెంకట్‌, కె చక్రవర్తి రెడ్డి, అడిషినల్‌ స్క్రీన్‌ ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్‌ పొట్లూరి, డిఒపి : విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌, ఎడిటర్‌: ఆంటోనీ రూబెన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, డైలాగ్స్‌: భాను-నందుఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.