Skip to content
వినోదం వార్తలు

సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ .. తమిళ్‌కు హోస్ట్‌గా హీరోయిన్‌ సమంత

Prajapaksham 19 Aug 2026 0 నిమిషాల పఠనం వినోదం
సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ .. తమిళ్‌కు హోస్ట్‌గా హీరోయిన్‌ సమంత

samantha

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన కుకింగ్ ఫార్మాట్‌కు తమిళ నేటివిటీతో సరికొత్త రూపం.. సోనీ విళా, సోనీ లివ్‌లో ఆహారం, రుచులు, భావోద్వేగాలు, అనుబంధాలను సెలబ్రేట్ చేయడానికి తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఒక్కచోటికి తీసుకొస్తున్న సమంత రూత్ ప్రభు
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తాజాగా ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కుకింగ్ ఫార్మాట్‌ను తమిళ ప్రేక్షకుల కోసం సోనీ విజా, సోనీ లివ్‌లో స్టార్ హీరోయిన్‌ సమంత రూత్ ప్రభు హోస్ట్ చేస్తుండ‌టం విశేషం.
సెలబ్రిటీలు, ఫుడ్, కాంపిటీషన్‌.. ఈ మూడు ప్రపంచాలను ఒకే ద‌గ్గ‌ర‌కి తీసుకొస్తూ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ రూపొందుతోంది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తొలిసారి సెట్స్ నుంచి కిచెన్‌లోకి అడుగుపెట్టి.. కఠినమైన వంటలకు సంబంధించిన‌ సవాళ్లు, ఊహించని ట్విస్టులు, ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారు. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. ప్రతి ఛాలెంజ్‌లో విజయం సాధించేలా రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ తమ టాలెంట్‌ను నిరూపించుకోబోతున్నారు.
ఈ సంద‌ర్భంగా సమంత మాట్లాడుతూ సమంత రూత్ ప్రభు హోస్ట్‌గా వ్యవహరిస్తూ..తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కిచెన్‌లోకి అడుగుపెట్టనున్న ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’.. సెలబ్రిటీ కుకింగ్‌కు సరికొత్త వినోదాన్ని తీసుకురానుంది అన్నారు.

ట్యాగ్‌లు: Hyderabad cinema news movie news