Retirement Crisis Looming? భారత మధ్యతరగతి జీవులకి రిటైర్మెంట్ టైం బాంబ్.. టాప్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ హెచ్చరిక
Cash
Retirement Crisis Looming? జీతం వచ్చే ఉద్యోగం ఒక దశలో ఆగిపోతుంది.. కానీ వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు, జీవన వ్యయాలు ఆగవని, 35 ఏళ్లు వచ్చినా పెట్టుబడులు ప్రారంభించని వారికి తీవ్ర ముప్పు తప్పదని ప్రముఖ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిరే అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ సీఈఓ స్వరూప్ మొహంతి, ప్రసిద్ధ రిటైర్మెంట్ వ్యూహకర్త మిలింద్ డియోగావ్‌కర్ ఆర్థిక ప్రణాళికపై ఉద్యోగులకు పలు కీలక సూచనలు చేశారు.
ఫిన్నోవేట్ పాడ్‌కాస్ట్‌లో స్వరూప్ మొహంతి మాట్లాడుతూ.. 35 ఏళ్ల వయసులో మనం సుదీర్ఘ కాలం జీవించబోతున్నామని గ్రహించాలి. ఒక దశలో క్రియాశీల ఆదాయం ఆగిపోయాక మీ వద్ద ఉన్న పొదుపు మాత్రమే మీకు స్నేహితుడిగా మిగులుతుంది. ఆలస్యంగా పెట్టుబడి ప్రారంభించడం వల్ల చక్రవడ్డీ (Compounding) ద్వారా వచ్చే భారీ లాభాలను కోల్పోతారని స్పష్టం చేశారు.
ఉదాహరణకు, 20 ఏళ్ల వయసులో నెలకు రూ. 10,000 నుండి 20,000 వరకు ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ నాటికి 12% వడ్డీ రేటు ప్రకారం రూ. 10 కోట్లు సాధించవచ్చని, అదే 40 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే నెలకు రూ. 2 లక్షల వరకు కేటాయించాల్సి వస్తుందని ఆయన వివరించారు. 35 ఏళ్లు అనేది పెట్టుబడులకు ఆఖరి అవకాశం అని.. తక్షణమే మంచి వైద్య బీమా ప్లాన్ కూడా తీసుకోవాలని సూచించారు.
మరోవైపు పదవీ విరమణ పొందిన వారు తమ వద్ద ఉన్న నిధిని ఎలా ఖర్చు చేయాలో తెలియక సతమతమవుతున్నారని విత్‌డ్రాయల్ వ్యూహకర్త మిలింద్ డియోగావ్‌కర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల వ్యయాలు, ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో విశ్రాంత ఉద్యోగులు తమ కార్పస్ నుంచి ఏడాదికి 2.5% నుండి 3.5% కంటే ఎక్కువ ఉపసంహరించుకోవద్దని ఆయన సిఫార్సు చేశారు. ఈ లెక్కన రూ. 2 కోట్ల కార్పస్ ఉంటే నెలకు రూ. 60,000, అదే రూ. 3 కోట్లు ఉంటే నెలకు రూ. 90,000 మాత్రమే లభిస్తాయి. మెట్రో నగరాల్లో నివసించే దంపతులు అత్యవసర వైద్య ఖర్చుల కోసం కనీసం రూ. 35 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ప్రత్యేక హెల్త్‌కేర్ ఫండ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు కోరారు.
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్