‘అ’ ఫస్ట్ లుక్ విడుదల..
Ah First Look
స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్ , ప్రముఖ ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘అ’ అనే ఆసక్తికరమైన టైటిల్ను హీరో అడివి శేష్ ఆవిష్కరించారు. టైటిల్ చుట్టూ ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలను పొందుపరిచారు. అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత జరిగే దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుందని ఈ పదాలు సూచిస్తున్నాయి. ఇక ఫస్ట్ లుక్ ఈ క్యూరియాసిటీని మరింత పెంచింది. రాహుల్ విజయ్ ఓ ప్రదేశంలో చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నేలంతా రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఈ ఇంటెన్స్ విజువల్కు బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ థ్రిల్లర్ కథ హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుందని అర్థమవుతోంది.శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
- చిక్కడపల్లి బావర్చి హోటల్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఫర్నిచర్ ధ్వంసం
- టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నియామకంపై టాటా ట్రస్టుల సవాల్..నేడు బాంబే హైకోర్టులో విచారణ
- నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. శుక్రవారం కేంద్ర కేబినెట్ భేటీ
- ఎవరీ వర్ధమాన్ జైన్ ? శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. ఎందుకీ భారీ విరాళం?
- ఇంటి నుంచే లెర్నర్స్ లైసెన్స్ LLR పరీక్ష.. తెలంగాణలో కీలక మార్పులకు రవాణా శాఖ కసరత్తు..