ఫౌజీ పోస్టర్ రిలీజ్
'Fauji' poster released.
రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ సమర్పిస్తున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ పోస్టర్ నుండి ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ వరకు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.’ఫౌజీ’ చిత్ర నిర్మాతలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బలమైన భావోద్వేగ, చారిత్రక నేపథ్యం ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. భారతదేశం నేడు జరుపుకుంటున్న స్వాతంత్ర్యం వెనుక ఉన్న త్యాగానికి నివాళిగా నిలిచిన ఈ పోస్టర్ అందరినీ కట్టిపడేసింది.పోస్టర్‌లో ప్రభాస్ ముఖం కనిపించకపోయినా, ఆయన లుక్ మాత్రం పవర్ ఫుల్ ఉంది. రక్తం, మట్టితో నిండిన దుస్తులతో, గాయాలతో కనిపిస్తున్న ప్రభాస్.. రెండు చేతుల్లో రెండు చిన్న తుపాకులు పట్టుకుని, చెప్పులు లేకుండా ధ్వంసమైన వీధుల్లో నడుస్తున్నారు. ఆయనకు ముందుగా సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మరో వ్యక్తి చేతిలో పొడవాటి కర్రతో నడుస్తూ కనిపించారు.
స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఫౌజీకి నివాళి అర్పించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. అనిల్ విలాస్ జాదవ్ ప్రొడక్షన్ డిజైన్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు.