JC Prabhakar Reddy: వినకపోతే మీ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధమే.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వీడియో వైరల్..
JC Prabhakar Reddy
JC Prabhakar Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలితో గుర్తింపు పొందిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పట్టణంలో జటిలంగా మారిన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆయన ఎవరూ ఊహించని రీతిలో వినూత్నంగా రంగంలోకి దిగారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోని వ్యాపారులకు స్వయంగా పూలదండలు వేసి, స్వీట్లు తినిపిస్తూ తనదైన శైలిలో గాంధీగిరి ప్రదర్శించారు.
తాడిపత్రిలోని ముఖ్యమైన రోడ్ల పక్కన, దుకాణాల ముందు ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఈ విషయమై గతంలోనే ఆయన పలుమార్లు వ్యాపారులకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. అయినా కూడా కొందరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆయనే నేరుగా రోడ్డుపైకి వచ్చారు.
పుట్లూరు రోడ్డులో పర్యటిస్తున్న సమయంలో కొన్ని షాపుల ముందు రోడ్డుకు అడ్డంగా బైక్లు పార్క్ చేసి ఉండటాన్ని గమనించిన ఆయన.. సదరు దుకాణదారుల వద్దకు వెళ్లి ప్రేమగా పూలదండలు వేసి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిట్టి, కొట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందుకే ప్రేమగా ఇలా దండలు వేసి స్వీట్లు ఇచ్చాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సహకరించండి. వినకపోతే మీ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధమే” అని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ గాంధీగిరి తర్వాత కూడా తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. “ఇంత చెప్పినా మారకపోతే, నేనే స్వయంగా వచ్చి మీ షాపులకు తాళాలు వేస్తాను” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కొనసాగుతుండగా, తండ్రీకొడుకులిద్దరూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రదర్శించిన ఈ వినూత్న నిరసన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- మిషన్ 360.. డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలన్న కేంద్రం… ఎన్డీఏకు ఇంకా ఎన్ని ఓట్లు కావాలి?
- నియోపోలీస్ భూముల వేలానికి స్పందన కరువు.. మూసాపేట్ ట్రక్ పార్క్ భూమికి భారీ డిమాండ్..ఎకరం రూ.200 కోట్లు..?
- డీలిమిటేషన్ బిల్లు ఈసారైనా పాస్ అవుతుందా? దక్షిణాదికి న్యాయం జరుగుతుందా?
- కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. తెలంగాణ నీళ్లు ఏపీకి తరలిపోతుంటే చూస్తూ ఊరుకోం: మంత్రి కోమటిరెడ్డి
- బర్త్ డే వేడుకల్లో రచ్చ.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్ట్!