Aban Ahmed Accident: అతీక్ అహ్మద్ చిన్న కుమారుడి రోడ్డు ప్రమాద వీడియో ఇదిగో.. గాల్లోకి బంతిలా ఎగిరి పల్టీలు కొట్టిన కారు..
Aban Ahmed Accident
Aban Ahmed Accident: గ్యాంగ్‌స్టర్‌గా మారి హత్యకు గురైన అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 6న ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదం దృశ్యాలు వేరొక వాహనానికి చెందిన డ్యాష్‌క్యామ్ కెమెరాలో రికార్డయ్యాయి.
21 ఏళ్ల అబాన్ అహ్మద్ తన నలుగురు స్నేహితులతో కలిసి తెల్లటి హ్యుందాయ్ క్రెటా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై అధిక వేగంతో వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాంక్రీట్ వారియర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ధాటికి కారు గాల్లోకి ఎగిరిపడటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటనలో అబాన్ అహ్మద్‌తో పాటు ఆయన స్నేహితుడు సోను (25) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. జైలులో ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను పరామర్శించేందుకు ఝాన్సీ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ప్రమాదం అనంతరం అబాన్ భౌతికకాయానికి ప్రయాగ్‌రాజ్‌లోని కసారీ-మసారీ శ్మశానవాటికలో కట్టుదిట్టమైన భద్రత నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి అతీక్ అహ్మద్, సోదరుడు అసద్ అహ్మద్ సమాధుల పక్కనే ఆయనను ఖననం చేశారు. జైలులో ఉన్న సోదరులు అలీ, ఉమర్‌లు పెరోల్‌పై ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
కాగా, 2023 ఏప్రిల్‌లో అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్‌లు పోలీసుల సమక్షంలో వైద్య పరీక్షలకు వెళ్తుండగా దుండగుల కాల్పుల్లో హత్యకు గురయ్యారు. అంతకుముందే ఆయన మరొక కుమారుడు అసద్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే.
- హైదరాబాద్ సిటీకి సరి కొత్త ‘క్యూర్’.. ఒకే ప్రాపర్టీ ఐడీ.. ఒకే బిల్లు.. ఒకే పోర్టల్
- NEHS: ఈహెచ్ఎస్కు విశేష స్పందన. 1,816 చికిత్స ప్యాకేజీలు.. కార్డు లేకున్నా ట్రీట్మెంట్..
- 30న వస్తున్న “క్రేజీ కల్యాణం”
- శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ చిత్రం.. పూజిత పొన్నాడ పోస్టర్ రిలీజ్
- తగ్గిపోతున్న పొదుపు కుటుంబాలలో సంక్షోభానికి సంకేతాలు