‘అగధ’ను మహేష్ ,ప్రభాస్ మెచ్చుకున్నారు – దర్శకుడు ఎం.ఎస్. రాజు
Agadha
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
‘అగధ’ అని టైటిల్ పెట్టగానే చాలా మంది నెట్లో సర్చ్ చేశారు. అగధ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ‘అగధ’. ప్రస్తుతం సినిమాకి ఓపెనింగ్స్ తీసుకు వచ్చేది యూత్, మాస్ ఆడియెన్స్. ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ బయటకు వస్తారు. అన్ని రకాల అంశాలు ‘అగధ’లో ఉంటాయి. దేవుడికి వ్యతిరేకంగా పని చేసే ఓ దుష్ట శక్తిని ‘అగధ’ అన్నట్టుగా చూపించాను.‘అగధ’ కోసం చాలా రీసెర్చ్ చేశాను.. ప్రస్తుతం ఉన్న తరాన్ని అట్రాక్ట్ చేసేలా దుష్టశక్తి మీద ఓ సినిమాని తీయాలని అనుకుని ‘అగధ’ చేశాను. కేవలం సింగిల్ స్క్రీన్స్ కాదు మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ని కూడా ఆకట్టుకోవాలని అనుకున్నాను. ఈ చిత్రాన్ని నిజాయితీతో తెరకెక్కించాను.
‘ఆట’, ‘మస్కా’ మంచి చిత్రాలు. కమర్షియల్‌గా విజయాలు అందుకున్నాను. కానీ నా స్టాండర్డ్‌లో లేవు అని చాలా మంది అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయి కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టాను. చాలా ఏళ్ల తర్వాత ‘డర్టీ హరి’ని తీశాను.ఎం.ఎస్. రాజు ఎలాంటి జానర్లో అయినా కూడా సినిమా తీయగలడు అనే పేరు సంపాదించుకోవాలి. నాకు నచ్చిన ఆర్ట్ ఫిల్మ్ తీసే బదులు మంచి కమర్షియల్ సినిమాని తీయడానికే ఇష్టపడతాను.‘అగధ’ని ముందు ఎవ్వరికీ ఇవ్వకూడదని అనుకున్నాం. ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది ఫోన్స్ చేశారు. కన్నడ నుంచి హోంబలే టీం సంప్రదించింది. గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియో టీం నుంచి కొంత మంది వచ్చి సినిమాని చూశారు. ముందు ఇక్కడ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత మిగతా భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాను. అన్ని భాషల్లో డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. అరవై రోజుల తర్వాతే ఓటీటీకి ఇస్తామని అన్నాను. నేను నా ఆర్టిస్టులందరితోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాను. ‘అగధ’ టీజర్, ట్రైలర్ చూసి మహేష్ బాబు నాకు వాయిస్ మెసెజ్ చేశారు. ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్ అన్నారు. ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు. త్రివిక్రమ్ షూటింగ్లో ఉండగానే వెంకటేష్‌ని కలిశాను. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.
‘అగధ’ రిలీజ్ అయిన తర్వాత ప్రీక్వెలా? సీక్వెలా? అన్నది చెప్తాను. ఈ మూవీకి ఆ స్కోప్ అయితే ఉంది. ‘అగధ’ ఓ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ అని మాత్రం చెప్పగలను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ‘అగధ’ ఉంటుంది.
- Azad Hind Party: ఆజాద్ హింద్ పార్టీ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు కొత్త పార్టీ పేరు ప్రకటన.. ప్రధాన అజెండా ఇదే..
- రూ.90 లక్షల ఇంటి అప్పులు.. ఇద్దరు పిల్లల్ని అనాధలుగా చేస్తూ దంపతులు ఆత్మహత్య..
- Hyderabad: ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు..
- El Nino- Monsoon: వర్షాలు దంచికొడుతున్నా తప్పని ఎల్‌నినో భయం..ఖరీప్ సాగుపై నిపుణులు ఆందోళన
- Vivo T5e విడుదల: 5500mAh బ్యాటరీ, AI ఫీచర్లతో బడ్జెట్ ధరకు కొత్త స్మార్ట్‌ఫోన్