US Visa Cancellation: 1.75 లక్షలకు పైగా వీసాలు రద్దు చేసిన అమెరికా.. విదేశీయులకు సీరియస్ వార్నింగ్..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్... వసూలు చేసిన అదనపు టారిఫ్‌లను తిరిగి చెల్లిస్తున్న అమెరికా
US Visa Cancellation: అమెరికా ప్రభుత్వం విదేశీ పౌరుల వీసాల విషయంలో మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. జాతీయ భద్రత, ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలులో భాగంగా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులకు జారీ చేసిన 1.75 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన విస్తృత స్థాయి భద్రతా పరిశీలనలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించడం, నేరాలకు పాల్పడటం, తప్పుడు లేదా మోసపూరిత పత్రాలను ఉపయోగించడం, దేశ భద్రతకు ముప్పుగా మారే చర్యలకు పాల్పడటం వంటి కారణాలతో పలువురి వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం (DUI), దాడులు, దొంగతనాలు, మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు వంటి కేసుల్లో ఉన్నవారిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. సంబంధిత వ్యక్తులపై అందిన సమాచారం, దర్యాప్తు సంస్థల నివేదికలను పరిశీలించిన అనంతరం వీసా రద్దు నిర్ణయాలు తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది.
అత్యాచారం, కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, చిన్నారులపై లైంగిక నేరాలు వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ పౌరులపైనా అమెరికా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి కేసుల్లో దేశ భద్రత, ప్రజా రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వీసాలను రద్దు చేసినట్లు వివరించింది.
అమెరికా భూభాగంలో బిడ్డకు జన్మనిస్తే పౌరసత్వం పొందే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దేశంలోకి రావడాన్ని సూచించే ‘బర్త్ టూరిజం’ను అరికట్టడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు భావించిన వ్యక్తుల వీసాలపై కూడా చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అదేవిధంగా అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యతలకు అనుగుణంగా క్యూబా, ఇరాన్, లావోస్, కువైట్ తదితర దేశాలకు చెందిన కొంతమంది వ్యక్తుల వీసాలను కూడా రద్దు చేసినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.
విదేశీ పౌరులకు అమెరికా ప్రభుత్వం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. అమెరికా వీసా అనేది వ్యక్తికి లభించే హక్కు కాదని, ప్రభుత్వం మంజూరు చేసే ప్రత్యేక అనుమతి మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసే వ్యక్తులపై అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వీసా ఉన్నంత మాత్రాన అమెరికాలోకి ప్రవేశం ఖరారు కాదని కూడా స్పష్టం చేసింది.
వీసా అనేది అమెరికా సరిహద్దు వరకు ప్రయాణించేందుకు అనుమతించే పత్రంగా మాత్రమే పరిగణించాలని, దేశంలోకి ప్రవేశానికి తుది నిర్ణయం మాత్రం సరిహద్దు వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులదేనని విదేశాంగ శాఖ మరోసారి వెల్లడించింది.
- Independence Day Speech: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం తెలుగులో.. ఆగస్టు 15 నాడు దేశభక్తిని చాటే విధంగా అద్భుతమైన స్పీచ్ ఇలా ఇవ్వండి..
- US Visa Cancellation: 1.75 లక్షలకు పైగా వీసాలు రద్దు చేసిన అమెరికా.. విదేశీయులకు సీరియస్ వార్నింగ్..
- ఆగస్ట్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. సరికొత్త గేమ్‌తో వస్తున్న వైసీపీ..
- Samsung Foldable ఫోన్ల సేల్ ప్రారంభం: భారీ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో Galaxy Z Fold 8, Flip 8 సిరీస్ కొనుగోలుకు చాన్స్..
- Flipkart Freedom Sale 2026: స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో చూడండి!