గొడ్డలి పట్టిన అయ్యప్ప భక్తుడు
Irumudi
రవితేజ తాజా చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్’, పాటలతో ఆసక్తిని రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 12న భీమవరంలో జరిగే భారీ కార్యక్రమంలో ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి రవితేజ హాజరుకానుండటంతో ఇది సినిమా ప్రచారంలో ఒక కీలక ఘట్టం కానుంది. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు. ఒకవైపు నోటిలో గొడ్డలితో మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, మరోవైపు అయ్యప్ప మాల ధరించిన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపిస్తున్నారు. ‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు చూడని విధంగా మరింత ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా తన కుమార్తెతో ఆయనకు ఉండే అనుబంధం ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆకట్టుకుంది. దీంతో సినిమాలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు కీలక స్థానం ఉండబోతుంది.
ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘ఇరుముడి’కి భీమవరంలో జరుగనుంది. మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీఓపీ : విష్ణు శర్మ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి.
- Telangana ACB Bribe Cases: అవినీతి సొమ్ముతో ఏసీబీకి అడ్డంగా దొరుకుతున్న అధికారులు.. రూ.4 లక్షల లంచంతో GHMC అధికారి, రూ.1 లక్ష కేసులో DMHO అరెస్ట్..
- Who is Neha Bora? ఎవరీ నేహా బోరా..? జంతర్ మంతర్ ఆందోళనల్లో మెరిసిన ధిక్కార స్వరం.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి?
- Dussehra 2026: దసరా తొలి రోజు అమ్మవారి అవతారం.. శైలపుత్రి దేవి వెనుక కథ ఇదే..
- Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు..
- US Measles Outbreak: అమెరికాలో మీజిల్స్ కలకలం.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 3,900కు చేరువైన కేసులు!