Skip to content
వినోదం వార్తలు

నయనతార అంకితభావంతో పనిచేశారు.. ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్ లో హీరో యష్

Prajapaksham 10 Aug 2026 0 నిమిషాల పఠనం వినోదం
నయనతార అంకితభావంతో పనిచేశారు.. ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్ లో హీరో యష్

Toxic' trailer

యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టాక్సిక్’ ట్రైలర్ విడుదలైంది. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ సీక్వెన్సులు, థ్రిల్లింగ్ మూమెంట్స్, ప్రొడక్షన్ డిజైన్, డార్క్ అండ్ టెక్చర్డ్ విజువల్స్‌తో ‘టాక్సిక్’ ప్రపంచాన్ని ట్రైలర్ రూపొందించారు.

యాక్షన్‌తో పాటు ఎమోషన్, రిలేషన్‌షిప్స్, క్యారెక్టర్ డైనమిక్స్‌కు కూడా ట్రైలర్ లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో విడుదల కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బెంగళూరులో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.
ఈ సందర్బంగా యశ్ మాట్లాడుతూ ఈ సినిమా కచ్చితంగా గుర్తుండిపోతుంది. ఇలాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. దాదాపు 200 రోజుల పాటు రెండు భాషల్లో ఈ సినిమాను షూట్ చేశాం. ఇందులో పనిచేసిన స్టార్స్ అందరూ తమ సమయాన్ని ఈ సినిమా కోసం డెడికేట్ చేశారు. నయనతార చాలా గ్రేస్‌ఫుల్‌గా ఈ సినిమాలో నటించారు. ఆమె లేడీస్ సూపర్‌స్టార్. ఆమె ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఇందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అందరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ ఈ సినిమా చెయ్యడం నిర్మాతగా నాకు చాలా ఆనందాన్నిచ్చింది. నాకు ఇదొక మెమొరబుల్ జర్నీ. ఈ సినిమా అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. దేశాల సరిహద్దులు దాటి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా ఇండియన్ సినిమాను మరింత ఎలివేట్ చేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్లు హుమా ఖురేషి , కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార , .దర్శకురాలు గీతు మోహన్‌దాస్ పాల్గొన్నారు.