ఆగస్టు 15న ‘ఖడ్గం’ రీరిలీజ్
'Khadgam' to re-release on August 15.
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధుమురళి నిర్మాతగా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఖడ్గం. ఖడ్గం సినిమా 2002 లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లవ్, కామెడీ, దేశం ఎమోషన్,.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కృష్ణవంశీ . ఇప్పటికి టీవీల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లలో ఈ సినిమాని వేస్తూనే ఉంటారు. ఈ సినిమా సాంగ్స్ కూడా ఆల్ టైం వినసొంపుగా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగష్టు 15న ఖడ్గం మరోసారి థియేటర్స్ లో విడుదల కానుంది, పాప్ కార్న్ ప్రొడక్షన్స్ లో దేవరపల్లి రేవంత్ సమర్పణలో విష్ణు మొలకల నక్షత్ర నిర్మాతగా కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహా నిర్మాతగా ఖడ్గం చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో పోలీస్ అధికారిగా శ్రీకాంత్ నటించారు. సోనాలి బింద్రే ఓ కీలక పాత్రలో నటించింది. నటుడు షఫీ ఈ సినిమా ద్వారా విలన్ గా పరిచయమైయ్యాడు.
- TRAI New Rules: డేటా అవసరం లేని వారికి గుడ్‌న్యూస్.. కేవలం కాల్స్, SMS కోసం తక్కువ కాలపరిమితి రీఛార్జ్‌లు..
- Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో దంచికొట్టనున్న వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Telangana SIR: తెలంగాణలో ఓటర్లకు అలర్ట్.. 43 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం.. స్పందించకపోతే తుది జాబితా నుంచి తొలగింపు
- Andhra Pradesh Rain Alert: ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. రేపు రాత్రి విశాఖ–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం..
- Khairatabad Ganesh Darshan: భక్తులకు అలర్ట్.. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం రేపు అర్ధరాత్రి వరకే.. 23 తర్వాత భక్తులకు నో ఎంట్రీ.. 25న నిమజ్జనం..