‘ది ప్యారడైజ్’ ట్రైలర్ అంతా రక్తమే
The Paradise Official TEASER
ఈ మధ్య తెలుగు సినిమాలో హింస మితిమీరిపోతోంది. ప్రతి సినిమాలో కత్తులతో నరుక్కోవడాలు, తలలు తీసెయ్యడాలు, నోటి నుంచి రక్తం కారడాలు వంటి సన్నివేశాలను చాలా మంది దర్శకులు క్లోజ్ షాట్ లో తీసి యాక్షన్ సన్నివేశాలను చాలా గొప్పగా తీశామని చెప్తుంటారు. అలాంటి దర్శకుల కోవలోనే శ్రీకాంత్ ఓదెల కూడా ప్రయాణం చేస్తున్నాడు. నాని హీరోగా నటించిన దసరా సినిమాలోనూ రక్తపాతం సృష్టించిన ఓదెల ఇప్పుడు తన రెండో చిత్రం ది ప్యారడైజ్ లోనూ మరింత ఎక్కువగా రక్తపాత సన్నివేశాలను పెట్టారని ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. అంతే కాదు ఈ ట్రైలర్ కు ఏకంగా ‘బ్లడ్ బాత్ ట్రైలర్ ‘గా నామకరణం చేసి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు. రెండు జాడలు వేసుకున్న హీరో నాని ది ప్యారడైజ్ సినిమా పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో నిర్మిస్తున్నారు . అయితే ట్రైలర్ చూస్తే ఈ మధ్య తెలుగు సినిమాల్లో వచ్చిన రక్త భరిత సినిమాల్లో ఇదే సినిమా క్రెడిట్ కొట్టేసేలా ఉంది. చిన్న పిల్లలు చూడలేనంతగా ఈ సినిమా ట్రైలర్ ను దూపొందించారు. ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.”ఇక నుంచి ఈ జాగా ఎవరిది… ఈ దేశం ఎవరిది?” అనే నాని పవర్ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. హై-వోల్టేజ్ యాక్షన్, రక్తం చిందించే బ్లడ్‌బాత్ సీక్వెన్స్‌లు ఇందులో చూపరులను భయపెట్టేవిధంగా ఉన్నాయి. చివర్లో “ఇరుగు దిష్టి… పొరుగు దిష్టి…” అంటూ నాని చెప్పినడైలాగులతో టీజర్ ముగుస్తుంది. మోహన్ బాబు పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తూ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన పలికిన డైలాగ్ టీజర్‌లోని ఇంటెన్సిటీని మరింత పెంచింది.కాయదు లోహర్, రాఘవ్ జుయాల్ పాత్రలు కూడా టీజర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.