Skip to content
వినోదం వార్తలు

మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో ‘మకుటం’

Prajapaksham 07 Aug 2026 0 నిమిషాల పఠనం వినోదం
మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో ‘మకుటం’

Makutam

సూపర్‌ గుడ్‌ ఫిలీమ్స్‌ బ్యానర్‌ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్‌ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్‌ బీ చౌదరి నిర్మాణంలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని 14న భారీ ఎత్తున రిలీజ్‌ చేయబోతోన్నట్టుగా ప్రకటించడమే కాకుండా.. 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని అప్డేట్‌ ఇచ్చారు. ఇప్పటికే విశాల్‌ ‘మకుటం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తుండటం. పైగా దర్శకుడిగా మొదటి సినిమా అవ్వడం, జివి ప్రకాష్‌ ఇచ్చిన మ్యూజిక్‌ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్‌ పెంచేలా కనిపిస్తున్నారు.ఈ సినిమాకి రిచర్డ్‌ ఎం. నాథన్‌, అభినందన్‌ రామానుజం కెమెరామెన్లుగా, శ్రీకాంత్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. విశాల్‌, అంజలి, దుషార విజయన్‌, జాన్‌ విజయ్‌, జయ ప్రకాష్‌, అజయ్‌, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్‌, ఝాన్సీ, పదం కుమార్‌, సభుమోన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి. ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు.