సందీప్ కిషన్ హీరోగా ‘కరికాల’
Karikala Movie
శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని సందీప్ కిషన్‌తో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న కరికాల సినిమా చేస్తున్నారు. . ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.‘కరికాల’ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ పోస్టర్లో సందీప్ కిషన్ కనిపిస్తున్న తీరు చాలా కొత్తగా ఉంది. గుర్రంపై హీరో, చేతిలో ఖడ్గం, సింహాన్నే పరిగెత్తిస్తున్నట్టుగా ఆ రాజసం అన్నీ కూడా సినిమాపై ఉత్సుకతను పెంచేలా ఉన్నాయి. ఈ టైటిల్ పోస్టర్‌తో ఒక్కసారి అంచనాల్ని రెట్టింపు చేసేశారు. ఈ మూవీని రెండు పార్టులుగా మేకర్లు ప్లాన్ చేశారు. మొదటి చాప్టర్ 2027 జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న రానుంది. ’శంభాల’ విజయం తర్వాత, దర్శకుడు యుగంధర్ ముని, షైనింగ్ పిక్చర్స్ బృందం ఈ ‘కరికాల’ ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. విస్తృతమైన ప్రపంచ నిర్మాణం, అత్యాధునిక విజువల్ ఎఫెకట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో, ’కరికాల’ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.