Skip to content
వినోదం వార్తలు

థ్రిల్లర్‌ మూవీగా ‘చిరంజీవి’

Prajapaksham 06 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
థ్రిల్లర్‌ మూవీగా ‘చిరంజీవి’

Chiranjeevi Movie

కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘చిరంజీవి‘. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ భరత్‌, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్‌ దర్శకత్వం వహిస్తున్నారు.‘చిరంజీవి’ సినిమా ఈ నెల 28న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఈ చిత్ర స్నీక్‌ పీక్‌ ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.‘చిరంజీవి’ సినిమా స్నీక్‌ పీక్‌ ఎలా ఉందో చూస్తే – చిరంజీవి అనే యువకుడు డెక్స్‌ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్‌. ఈ జంట సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమవైపుకి గుండె లయను గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్‌, ఈ ట్విస్ట్‌ క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తోంది. చివరలో గ్రేషేడ్‌లో హీరోను చూపించారు. ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసే అన్ని ఎలిమెంట్స్‌ తో ఈ నెల 28న తెరపైకి రాబోతోంది. ఈ చిత్రానికి డీవోపీ – రామకృష్ణ,మ్యూజిక్‌ – శేఖర్‌ చంద్ర,ఎడిటింగ్‌ – ఛోటా కె ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – యష్‌ మిట్టల్‌, కొరియోగ్రఫీ – గోవింద్‌, శుభ సాయి వెంకట్‌, ప్రొడ్యూసర్‌- దీప్తి నడిమింటి, స్క్రిప్ట్‌, డైరెక్షన్‌- శుభా సాయి వెంకట్‌.