Hyderabad Weather Today: హైదరాబాద్ వాతావరణం.. వర్షాలకు సిద్ధంగా ఉండండి.. ఐఎండీ యెల్లో అలర్ట్..
Hyderabad Weather Today
Hyderabad Weather Today: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. హైదరాబాద్ వాతావరణం విషయానికి వస్తే.. భాగ్యనగరంలో పగటిపూట అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, ఆకాశం రోజంతా మేఘావృతమై ఉంటోంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 28°C నుండి 29°C వరకు, కనిష్ఠంగా 24°C వరకు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో పాటు పశ్చిమ దిశ నుండి ఈదురుగాలులు వీస్తున్నాయి.
భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు (ఆగస్టు 4) తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
రాజధాని హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాలలో రాబోయే కొద్ది రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆగస్టు రెండవ వారంలో బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడే అల్పపీడన వ్యవస్థల కారణంగా రాష్ట్రంలో వర్షాల తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రహదారులు తడిగా ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Karthika Pournami 2026: తెలంగాణలో కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం ఎక్కడెక్కడ? ఫేమస్ ఆలయాల లిస్ట్ ఇదే
- Kartika Purnima 2026: కార్తీక పౌర్ణమి రోజున ఈ 5 తప్పులు అస్సలు చేయకండి… చేస్తే దోషం తగులుతుంది
- Godavari Pushkaralu 2027: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు.. ఎనిమిది కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ‘Congress Is Guaranteed 100 Seats’: నా ప్లాన్ అమలు చేస్తే కాంగ్రెస్కు 100 సీట్లు ఖాయం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జోస్యం..
- Telangana Politics: తెలంగాణలో బీఆర్ఎస్కు అధికారం దక్కడం కలే.. ఇంకా వారు ఊహల్లోనే బతుకుతున్నారు.. భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు