‘టాక్సిక్’ ట్రైలర్ 8న రిలీజ్
Toxic Trailer To Release On August 8
రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొత్త పోస్టర్‌లో యష్ పోషిస్తున్న ‘రాయా’ పాత్రను సిల్హౌట్ రూపంలో చూపించారు. చేతిలో టామీ గన్ పట్టుకుని కనిపించే ఈ పోస్టర్, సినిమా ప్రపంచం ఎంతరా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో సూచిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌లాగే ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తూ, సినిమా కథపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ట్రైలర్‌ను బెంగళూరులో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. యష్, కేవీఎన్ ప్రొడక్షన్స్ హోమ్ స్టేట్ అయిన కర్ణాటక నుంచే సినిమా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఆగస్టు 8 తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ‘టాక్సిక్’ షూటింగ్ ప్రారంభమై సరిగ్గా రెండేళ్లు పూర్తవుతున్న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యష్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది