Skip to content
జాతీయం వార్తలు

నవతరం జంతర్‌మంతర్‌ నిరసనలు ఏమి బోధిస్తున్నాయి?

Prajapaksham 01 Aug 2026 0 నిమిషాల పఠనం జాతీయం
నవతరం జంతర్‌మంతర్‌ నిరసనలు ఏమి బోధిస్తున్నాయి?

Protest (1)

వారు ఒక పుస్తకం చేత్తో పైకెత్తారు ఆకాశంలో రంధ్రం పెట్టారు. ముంబయిలో రోడ్డుకు అడ్డంగా నిలబడి రెండు చేతులతో పోలీసు వ్యాన్‌ను నిలుపు చేసిన యువతి గుర్తుందా? జంతర్‌మంతర్‌లో ఒక యువ మహిళ రోజులుగా ఆహారం తినకుండా బక్కచిక్కిన మహిళ రాజ్యాంగాన్ని తన తలపై పెట్టుకోవడం గుర్తుందా? ఆమె ఆగ్రహంతో కాకుండా ప్రమిదను పైకెత్తిన రీతిలో ఆ పనిచేశారు.
ఆ పుస్తకాన్ని దించండి, మడతపెట్టండి, ఇంటికి వెళ్లండి, ఎన్నడూ రాని రుతువుకోసం వేచి చూడండి, చట్టం తన పని తాను చేసేవరకు ఎదురుచూడండి అని వారికి వారాలపాటు చెప్పారు. అప్పుడు ఒక సాధారణ మధ్యాహ్న సమయంలో మంత్రి రాజీనామా చేశారు. ఆ పుస్తకం కిందకు రాలేదు. మరింత ఎత్తుకు లేచింది. ఆ పుస్తకం (రాజ్యాంగం) పట్ల మా యువతరం అభిమానం పెంచుకున్నారని మనం జంకులేకుండా ప్రపంచానికి చెప్పవచ్చు. ఇది విజయం. రాజీ కాదు. ఎవరో వెనుక ఉండి నడిపిన వెనుకంజ కాదు. పరువు కాపాడుకునే పని అంతకన్నా కాదు. ఒక తప్పును ఎత్తి చూపారు. జవాబు చెప్పటానికి తిరస్కరించిన అధికారం జవాబు చెప్పింది. యువత ఒఠ్ఠి చేతులతో దాన్ని సాధించారు.
జన్‌ మధ్య జన్మించిన వ్యక్తులు సంవత్సరాల వయో బృందంకన్నా పై వయస్సువారు దీన్ని సగం ఉడికించిన విప్లవం అన్నారు. మేము అంటాం : మీరు, నేను చేసిందేమీ లేదు. మన పూర్వీకులు సాధించారు. వారి వారసత్వం ఫలాలను మన వ్రేళ్ల సందులగుండా జారవిడుచుకున్నాం. ఈ యువకులవైపు చూసి, వారు ఇంకా ముందుకు వెళ్ళలేదని గొణిగేవారికి మా సమాధానం “మనం వెళ్లామా?”. నేడు మధ్య దూరం గడియారం లో కొలవబడదు. తాడు సహాయం లేకుండా విశ్వాసం వేసిన గెంతులతో, భయం ఆవహించకమునుపే దానిలోపల వ్యవహరించగలిగిన ధైర్యంతో కొలవబడుతుంది. చరిత్ర కేవలం అభిప్రాయాలతో కాదు, మనుషుల శరీరాలతో నిర్మించబడుతుంది.పరుగుతీయకుండా, తుపాకుల ముందు ధైర్యంగా నిలబడిన దేహాలు దాన్ని నిర్మిస్తాయి. చలి, వర్షాలు లెక్కచేయకుండా వీధుల్లో నిలబడిన దేహాలు చరిత్ర నిర్మిస్తాయి. దేశం సిగ్గుపడే విధంగా చేస్తూ ఆహారం ముట్టని వారు దాన్ని నిర్మిస్తారు.
దొంగలించబడింది కేవలం ఒక పథకం కాదు అది మన హుందాతనం, ఆత్మగౌరవం; మెరిట్‌ వాస్తవం, కృషి గౌరవం పొందుతుందనేది యువత విశ్వాసం. మన నష్టాలు యధార్థం. అనేకమంది పౌరసత్వం సందేహాంలో పెట్టబడింది. జీవనోపాధులు హరించారు. యువత ఆ నష్టాలనుంచి లేచి వాటిని మేళ్లుగా మార్చుకున్నారు. అవమానాన్ని తమ సొంత గొంతుకలతో శక్తిగా మార్చుకున్నారు. ఇది ఎవరి విజయం అనే విషయంలో ఎవరూ తప్పు చేయకూడదు. ఇది విద్యార్థులది తప్ప మన ది కాదు. అయితే వారిక్కడికి ఒంటరిగా రాలేదు. మనం మహానుభావుల భుజాలపై నిలబడి ఉన్నాం. వారి పేర్లు చెబుదాం. పిడికెడు ఉప్పు కోసం పాదయాత్రగా సముద్రానికి వెళ్లిన బక్కపలచని మనిషిని గుర్తు చేసుకుందాం. ఉదయాన యావత్‌ శాసన గ్రంధాన్ని చేబూని ఉన్న సామ్రాజ్యాన్ని రాత్రికి దాని చట్టబద్ధతను కోల్పోయేలా చేశారు. 1970వ దశకంలో, తమది శాశ్వతం అనుకున్న ప్రభుత్వాన్ని కుదిపివేస్తూ తరగతులు బహిష్కరించిన విద్యార్థులను స్ఫురణకు తెచ్చుకుందాం. 2012లో ఒక డిసెంబర్‌ రాత్రి, తామెన్నడూ కలుసుకోని ఒక మహిళ కోసం కొవ్వొత్తులు చేతబట్టి ఇండియా గేట్‌ను ముంచెత్తిన యువతను, చట్టాన్ని తిరగరాసేవరకు ఇంటికి తిరిగి వెళ్లని ఆ యువతను యాది చేసుకుందాం. ప్రతి దశాబ్దంలో, ప్రతి కూడలి ప్రదేశంలో, యువతకు చెప్పింది ఒక్కటే, ‘ఆ గంట (సమయం) తప్పు, పద్ధతి తప్పు, ఇంటికి వెళ్లండి, వేచి చూడండి.’ వారి పోరా టం మన పోరాటం, వారి పరిపూర్తికాని భవిష్యత్‌ ఇప్పుడు మనది. మనల్ని కలిసికట్టు చేస్తున్న బంధనం అదే. అది తప్ప మరేదీ మనకు పట్టదు.
వారు దేన్నీ పట్టించుకోరు అని దేశం కొట్టిపారేసిన తరం అంతా వింటున్నది. వినిపించుకోనిది మనమే.
డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వాషింగ్టన్‌లో ఒక సభలో తాను రాసుకున్న ప్రసంగం చదువుతున్నారు. చప్పగా ఉంది. అంతలో ఆయన వెనుకనుంచి మహాలియా జాక్సన్‌ స్వప్నం గూర్చి వారికి చెప్పు మార్టిన్‌” అని కోరారు. ఆయన చేతిలోని కాగితం పేజీలు పక్కన పెట్టాడు. ఈ క్షణాలు జాగ్రత్తగా ఉండటానికి తిరస్కరించే గొంతుల నుంచి తప్ప జాగ్రత్త వహించే వారి నుంచి ఎన్నడూ రావు. ద్రోహానికి గురైతే, ఈతరం తుపాకీ వద్దకు చేరుతుంది. రాజ్యాంగం ద్వారా చేసిన బోధన కారణంగా వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటానికి తుపాకీ మీట చేతికి తీసుకోకుండా కొవ్వొత్తులు చేబూనారు. ఈ కారణంగా దుష్యంత్‌ కుమార్‌ గేయపాదం ఒకటి అనేక రోజుల పాటు మా బుర్రలు తొలుస్తూనే ఉంది : ఆకాశానికి రంధ్రం చేయలేమని ఎవరంటారు మిత్రులారా, నిండుమనస్సుతో ఒక రాయి విసరండి! అంటారాయన .
విజయం ఆచరణ నుండి భిన్నమైంది కాదు, అది ఉచితం కూడా కాదు. ఒక తల్లి మొదటి రోజున స్టీలు టిఫెన్‌తో వచ్చారు, తిరిగి వెళ్లలేదు. పిల్లలను తన సొంత పిల్లలుగా భావించి భోజనం పెట్టారు. మరికొందరు ఒక ఫొటోగ్రాఫ్‌ చేతబట్టి, ఏ రాజీనామా తొలగించలేని దుఃఖ భారంతో వచ్చారు. అపరిచితులు నిరసనకారులకు ఆహారం ఇచ్చారు. విద్యార్థులు బల్ల పరుపు రాళ్లపై పడుకున్నారు. రాజ్యాంగాన్ని గంటల పాటు ఒక చేతినుంచి మరొకరి చేతికి మార్చుకుంటూ దాని జీవశక్తిని చాటారు.
ఆ తర్వాత, జులై 20న, రాజ్యాంగం చేతబట్టి, అది ఎక్కడైతే స్థిరంగా ఉండాలో ఆ పార్లమెంట్‌కు ప్రదర్శనగా బయలుదేరినపుడు రాజ్యం (ప్రభుత్వం ) తన సమాధానమేమిటో చెప్పింది. వారు గుమికూడకుండా మెట్రోస్టేషన్లు మూసివేసింది. మన ప్రజాస్వామ్య కేంద్రం చుట్టూ ఇంటర్నెట్‌ నిలుపుచేసింది. నిరాయుధులైన యువకుల నెత్తిన లాఠీలతో మోదింది, వారి దేహాల మీదకు బాష్పవాయువు గోళాలు విసిరింది. తమ ఛాతీపై తామెవరో తెలిపే పేర్లులేకుండా సాధారణ దుస్తుల్లో సాయుధులను గుంపుల్లోకి పంపింది. నిరాహారదీక్ష చేస్తున్న వారిని లాగి బస్సుల్లో పడేసింది. దీన్నంతా దేశం తిలకించింది.
ఇప్పుడు కఠిన వాస్తవం చూద్దాం. ఈ విజయాన్ని వేడుక చేసుకోవటం అంటే సంతృప్తి చెందటాన్ని నిజాయితీతో తిరస్కరించటమే. చరిత్ర విద్యార్థుల పార్లమెంట్‌ యాత్రను గుర్తుంచుకోదు. ఈ యాత్ర చేసిన చట్టాన్ని గుర్తుంచుకుంటుంది. 1963 నాటి వాషింగ్టన్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ స్వప్నం వల్లనే గుర్తింపు పొందలేదు. ఆ స్వప్నం పౌరహక్కుల చట్టంగా వ్యక్తీకరణ పొందినందున గుర్తుచేసుకోబడుతుంది. మనదేశంలో మనకూ ఒక రుజువు ఉంది. 2012 డిసెంబర్‌ నాటి విచారం, ఆగ్రహం ఆ తర్వాత క్రిమినల్‌ చట్టంలో ప్రతిబింబించింది. ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం పాటు రైతుల ఆందోళన వారు వ్యతిరేకించిన చట్టాల రద్దుకు దారి తీసింది. మనదేశం ఇప్పటికీ తన సొంత పౌర హక్కుల చట్టంకోసం సమానత్వం కలుగజేసే, వివక్ష వ్యతిరేక చట్టం కోసం, రాజ్యాంగం ఇప్పటికే ఇచ్చిన హామీకి జవసత్వాలు చేకూర్చే చట్టం కోసం వేచి చేస్తున్నది.
మూడు రుణాలతో కూడిన అసంపూర్ణ కృషి ఏమిటో మేము స్పష్టం చేయదలిచాము.
ఒకటి, పరీక్ష. ఆస్థాయిలో ప్రశ్నాపత్రం లీకేజీ దురదృష్టం కాదు, అది వ్యవస్థ వైఫల్యం. దానిని నిర్వహిస్తున్న ఏజన్సీ లక్షలాదిమంది భవిష్యత్‌ను క్లరికల్‌ విషయంగా పరిగణించటాన్ని అనుమతించరాదు. పరీక్ష నిజాయితీని చట్టం ద్వారా అమలు జరపాలి. దానిపై పునఃపరిశీలన ఉండాలి.
రెండు, పోలీస్‌. జులై 20న జరిగింది ఆర్డర్‌ను(శాంతి కాపాడటం కాదు, తద్విరుద్దం. లాఠీతో ఒక విద్యార్థి తల పగలగొట్టటం నియంత్రణ చర్యకాదు. జనంపైకి బాష్పవాయువు గోళాలు ప్రయోగించటం జనాలను అదుపుచేయటం కాదు. సాధారణ దుస్తుల్లోని వ్యక్తి చట్టాన్ని అమలు చేసే అధికారి కాదు, నకిలీ. కోర్టులు 2018 నుంచీ పదే పదే అడుగుతున్న ప్రామాణిక ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను ప్రభుత్వం ఇంతవరకు సమర్పించలేదు. ఆరోజున చేయి పైకెత్తిన ప్రతీ ఆఫీసర్‌పై
కేసుపెట్టాలి.
మూడో రుణం, మనం సన్నిహితమైంది, కఠినమైందీ, ఎందుకంటే అది మనం నలుపు, తెలుపు దుస్తులు ధరించే మనం నెరవేర్చాల్సింది. కోర్టుల్లో అధికారులమైన మనం ఇప్పు డు అభిశంసించాలి. మనం మౌనంగా ఉంటూ ఒక మంత్రి జవాబుదారీ తన్నాన్ని డిమాండ్‌ చేయటం మంచిగా ఉండదు. విచారణ మొదలు కాకముందే నిరసన ముగిసిపోయేంతగా హక్కు వినియోగం వేచి ఉండాల్సివస్తే న్యాయం చేసినట్లు కాదు. జడ్జీలు, న్యాయసేవకులు తప్ప యజమానులు కాదు. తీర్పు చెప్పండి లేదా తప్పుకోండి. విస్మరణ ఖరీదును మనం చూశాం. సంవత్సరాలు గడిచినప్పటికీ జామియా విద్యార్థుల దృశ్యాలు కళ్లముందు కదలాడుతున్నాయి. పోలీస్‌ లు వారి లైబ్రరీలోకి చొరబడి, టేరబడి కింద దూరినవారిని సైతం బాదారు. చట్టం క్రమం ఇంకా కొనసాగుతోంది. ఒక్క అధికారినీ జవాబుదారీ చేయలేదు. ఆ కేసు ఈరోజుకీ కోర్టులో మూలుగుతోంది.
ఒక సంస్థను కాపాడుకోవటమంటే విమర్శనుంచి దాన్ని రక్షించుకోవటం కాదు. దాని ప్రామాణికతను కాపాడాలి. కోర్టును ప్రశ్నించని లాయరు, ప్రభుత్వాన్ని ప్రశ్నించని పౌరుడు , ఓర్మి వహించాలని బోధ చేసే పెద్దలు మన సంస్థల సంరక్షకులు కారు. సంస్థలను పట్టించుకోకుండా యువత వీధుల్లోకి రావటానికి అవే కారణాలు. సంరక్షణ బాధ్యత నిఘా కలిగి ఉండటం తప్ప విధేయత ప్రదర్శించటం కాదు.
ఇప్పుడు ఆకాశంలో రంధ్రం పడింది. దాని గుండా కాంతి ప్రసరిస్తున్నది. అయితే ఆకాశంలోని రంధ్రం దానికదిగా తెరుచుకుని ఉండ దు. ఎవరూ దానిపై దృష్టి పెట్టకపోతే అది నెమ్మదిగా మూసుకుంటుంది. రాజీనామాను నిలువెత్తు విగ్రహంగా మార్చటం ద్వారా, ప్రజలు అడిగినప్పుడు అధికారం జవాబు చెప్పేటట్లుగా మీ ధైర్యం శాశ్వత ఆశాభావంగా ఉండేటట్లు మీరు ఆ రంధ్రాన్ని తెరిచి ఉంచండి.

ట్యాగ్‌లు: CJP CJP protest Protest