Skip to content
వినోదం వార్తలు

ఆగస్టు 21న థియేటర్లలో ‘ఇరుముడి’

Prajapaksham 30 Jul 2026 1 నిమిషాల పఠనం వినోదం
ఆగస్టు 21న థియేటర్లలో ‘ఇరుముడి’

Irumudi release date

రవితేజ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఇరుముడి’పై భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ‘ఫస్ట్‌ గ్లింప్స్‌’, చార్ట్‌బస్టర్‌ అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’తో ప్రేక్షకులను అలరిస్తోంది. విడుదల తేదీకి సంబంధించి నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ, అనుకున్న సమయానికే అంటే ఆగస్టు 21న ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్‌ చేసింది. విడుదల షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తూ, ‘25 days To Go’ పోస్టర్‌ను విడుదల చేశారు. కొత్తగా విడుదలైన ఈ పోస్టర్‌ సినిమాలోని ఎమోషన్‌ ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఇందులో రవితేజ, చిన్నారి నక్షత్ర మధ్య తండ్రీ-కూతుళ్ల అనుబంధం ఎంతో ఆప్యాయంగా కనిపిస్తోంది. రవితేజ పేకాటలో నిమగ్నమై ఉండగా, ఆ చిన్నారి వెనుక నుండి ఆప్యాయంగా అతన్ని కౌగిలించుకోవడం, ఈ కథలోని ఎమోషన్‌ ని ప్రజెంట్‌ చేస్తోంది. ప్రియా భవాని శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తోంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని, సాహి సురేష్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ను, ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తుండగా, జి.వి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలుస్తోంది. మాస్‌ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్‌, సాయి కుమార్‌, బేబీ నక్షత్ర, అజయ్‌ ఘోష్‌, రమేష్‌ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్‌, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, రమణ భార్గవ్‌, కిషోర్‌ కంచెరపాలెం, కార్తీక్‌ అడుసుమల్లి, మహేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జివి ప్రకాష్‌ కుమార్‌, డిఒపి : విష్ణు శర్మ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి.

ట్యాగ్‌లు: Irumudi Telugu cinema news