న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ విడుదల
Newtons 3rd Law trailer is OUT NOW!
సుమంత్ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ చాలా నచ్చింది. డైరెక్టర్ రాజేష్ నాకు ఎప్పటినుంచో మంచి స్నేహితుడు. ఇలాంటి సినిమా తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్లో చాలా మంచి ఎనర్జీ ఉంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. సుమంత్ నా ఫేవరెట్ బ్రో. నా ఫస్ట్ సినిమా నుంచి చాలా సపోర్ట్‌గా ఉన్నాడు. జగపతి బాబు గారు చాలా స్టైలిష్‌గా అనిపించారు. చాలా మంచి టీమ్‌తో వస్తున్న సినిమా ఇది. జులై 31న అందరూ కూడా ‘న్యూటన్స్ థర్డ్ లా’ సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘మళ్లీ రావా’ సినిమా తర్వాతసింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసిన కథ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేష్ ఈ కథ చెప్పిన వెంటనే ఓకే చేశాను. రాజేష్ స్టైల్, కథ, స్క్రీన్‌ప్లే నాకు చాలా నచ్చాయి. ఈ ట్రైలర్లో మేము చాలా తక్కువ కథనే చెబుతున్నాం 31న థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు రాజేష్ కర్ణ ,మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, యాక్టర్ త్రినాథ్ , నటుడు రవి వర్మ నటిస్తున్నారు .