Skip to content
జాతీయం వార్తలు

Cockroach Janta Party: సీజేపీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..

Prajapaksham 07 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Cockroach Janta Party: సీజేపీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..

Cockroach Janta Party: సీజేపీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..

Cockroach Janta Party: సీజేపీ ఎక్స్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి విదితమే. తాజాగా నీట్ పరీక్ష ముగియడంతో ‘సీజేపీ’ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నీట్ (NEET) పరీక్ష ముగియడంతో.. సీజేపీ సోషల్ మీడియా ఖాతాను బ్లాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ప్రధాన ఆందోళన ఇప్పుడు ఉనికిలో లేదని స్పష్టం చేస్తూ.. ‘బొద్దింక జనతా పార్టీ’ (సీజేపీ) కి చెందిన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం (జూలై 7, 2026) ఆదేశించింది.

పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాను నిరోధించడాన్ని సవాలు చేస్తూ అభిజీత్ దీప్కే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వరణ కాంత శర్మ అనుమతించారు. ఈ మేరకు సదరు ఖాతాను అన్‌బ్లాక్ చేయాలని న్యాయమూర్తి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిరోధక చర్యకు కేంద్ర ప్రభుత్వం చూపిన ప్రధాన కారణం నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా ఆందోళనలని కోర్టు గుర్తుచేసింది. అయితే, సదరు పరీక్షలు ఇప్పుడు విజయవంతంగా ముగిసినందున ఆ ఆందోళన ఇకపై అప్రస్తుతం అని పేర్కొంటూ ఖాతాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.

అంతకుముందు ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్, మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరిస్తూనే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నియమాలు-2009 కింద చట్టబద్ధమైన సమీక్షా కమిటీని పిటిషనర్ ఫిర్యాదులను పరిశీలించి కేంద్రం స్పందనను కోరాలని ఆదేశించారు.

గత విచారణల సందర్భంగా పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాలోని కొన్ని పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని భావిస్తే కేవలం ఆ పోస్టులను మాత్రమే బ్లాక్ చేసి ఉంచి, మొత్తం ఖాతాను మాత్రం పునరుద్ధరించాలని ఆయన కోరారు. గతంలో సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన కేసుల్లో కూడా వివిధ న్యాయస్థానాలు ఇలాంటి విధానాలనే అనుసరించాయని ఆయన ఉదాహరణలతో వివరించారు.

మరోవైపు, ఆ ఖాతా కార్యకలాపాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం ఈ పిటిషన్‌ను గట్టిగా వ్యతిరేకించింది. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వరణ కాంత శర్మ.. కేంద్రం వ్యక్తం చేసిన ప్రధాన ఆందోళన నీట్ పరీక్ష ముగియడంతో ముగిసిపోయిందని అభిప్రాయపడుతూ.. ఖాతాను అన్‌బ్లాక్ చేయాలని తుది తీర్పునిచ్చారు.

ట్యాగ్‌లు: BJP Cockroach Janta Party Delhi HC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *