Skip to content
బిజినెస్ వార్తలు

ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఎలా పొందాలి? ఏయే ఆసుపత్రుల్లో చికిత్స ఉచితంగా పొందవచ్చు..Step By Step ఆన్ లైన్ ప్రాసెస్ మీ కోసం..

Prajapaksham 05 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఎలా పొందాలి? ఏయే ఆసుపత్రుల్లో చికిత్స ఉచితంగా పొందవచ్చు..Step By Step ఆన్ లైన్ ప్రాసెస్ మీ కోసం..

ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఎలా పొందాలి? ( ayushman bharat card )

ప్రస్తుత కాలంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఎంతో మంచిది. . ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ స్కీం అర్హులైన వారికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్ కార్డును పొందిన వారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డు పొందడానికి కావాల్సిన అర్హతలు అలాగే ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

>> ఆయుష్మాన్ భారత్ కార్డు పొందేందుకు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://pmjay.gov.in/లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత అక్కడ Am I Eligible’ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.

>> అనంతరం వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ముందుగా మీ మొబైల్ నెంబర్, అలాగే క్యాప్చ కోడ్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది.

>> కావాల్సిన వివరాల్లో మీ రాష్ట్రం జిల్లా అలాగే ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ నమోదు చేసి మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

>> . ఇప్పుడు మీకు ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ లేదా ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసిన తర్వాత లబ్ధిదారుల లిస్టులో మీ పేరు కనుక ఉన్నట్లయితే, Do e-KYC అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని ఇప్పుడు ఆధార్ ద్వారా బయోమెట్రిక్ లేదా ఓటీపీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.

>> అనంతరం ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది అనంతరం మీరు మీ పేరిట ఉన్న ఆయుష్మాన్ భారత్ కార్డును ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

>> మీరు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి Ayushman App డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా కూడా లాగిన్ అయ్యి మీరు పూర్తి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాకపోతే మీ సమీపంలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి అక్కడ మీ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వివరాలను తెలపడం ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు.

>> ఇప్పుడు దేశవ్యాప్తంగా నమోదు అయినటువంటి వేలాది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ కార్డు చెల్లుబాటు అవుతుందో తెలుసుకునే అవకాశం ఉంది. దీనికోసం https://pmjay.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి Find Hospital ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ రాష్ట్రం జిల్లా ఆసుపత్రి రకం ప్రభుత్వమా లేదా ప్రైవేట్ ఆసుపత్రి వంటి వివరాలను నమోదు చేసి మీ అందుబాటులో ఉన్నటువంటి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో జాబితా కనిపిస్తుంది.

>> . ఈ లిస్టులో నగరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఉండే అవకాశం ఉంది అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని ప్రైవేటు ఆసుపత్రిలోనూ ఈ పథకం అందుబాటులో ఉండకపోవచ్చు కనుక వెబ్సైట్ జాబితాను ముందుగా తనిఖీ చేసుకొని అందుబాటులో లిస్టులో ఉన్న ఆస్పత్రుల్లో మాత్రమే ఆయుష్మాన్ భారత్ కార్డును తీసుకొని వెళ్లి ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.

ట్యాగ్‌లు: Ayushman bharat card business news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *