Skip to content
తెలంగాణ వార్తలు

రైల్వే శాఖ మంత్రితో చ‌ర్చ‌లు సానుకూలంగా సాగాయి: సీఎం రేవంత్ రెడ్డి

Prajapaksham 23 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
రైల్వే శాఖ మంత్రితో చ‌ర్చ‌లు సానుకూలంగా సాగాయి: సీఎం రేవంత్ రెడ్డి

Discussions with the Railway Minister were positive: CM Revanth Reddy

హైద‌రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విష‌య‌మై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌తో చ‌ర్చ‌లు సానుకూలంగా జ‌రిగాయ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో సోమ‌వారం రాత్రి సీఎం భేటీ అయ్యారు. అనంత‌రం సీఎం విలేక‌రుల‌తో మాట్లాడారు. రైల్వే మంత్రితో చ‌ర్చ‌లు సానుకూలంగా సాగాయ‌న్నారు. ఈ అంశంపై కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం భేటీ అవుతామ‌ని సీఎం వెల్ల‌డించారు.

ట్యాగ్‌లు: CM Revanth Reddy Telangana