Skip to content
తెలంగాణ వార్తలు

ప్రైవేట్ స్కూల్స్ అడ్డగోలు ఫీజులుపై స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్‌ను ముట్టడించిన AISF

Prajapaksham 22 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ప్రైవేట్ స్కూల్స్ అడ్డగోలు ఫీజులుపై స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్‌ను ముట్టడించిన AISF

AISF Protests Against Rising Private School Fee Burden

  • ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి.
  • ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచన విరమించుకోవాలి.
  • ఫీజులు నియంత్ర చట్టాన్ని అమలు చేయకపోతే తిరుగుబాటే.
  • ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్
  • ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యా కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం.
  • ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు

పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో  ఫీజుల దోపిడి అరికట్టాలని, ఫీజుల నియంత్రం చట్టం అమలు చేయాలని , విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేదలకు25%సీట్లుఉచితంగా  ఇవ్వాలని,27వేల  ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు తగ్గిస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వెనక్కి తీసుకొని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని డిమాండ్  చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్, లక్డికపూల్ పాఠశాల విద్యా కార్యాలయం ముందు ధర్నాకు టెలిఫోన్ భవన్ నుండి ర్యాలీ వెళ్లగా పోలీసులు అడ్డుకొని ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తూ, యాజమాన్యాలు పాఠశాలలను అంగడి కేంద్రాలుగా మార్చాయి.ఎల్కేజీ విద్యకు లక్ష నుండి నాలుగు లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ,  పుస్తకాలు ,యూనిఫామ్, ఐడి కార్డ్,డైరీలు, అడ్మిషన్ ఫీజుల పేరిట మరో లక్ష రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని ఏ ఒక్క పాఠశాల కూడా ఫీజుల నియంత్ర చట్టం అమలు చేయడం లేదని, విద్యా హక్కు చట్టం అమలు ఊసే లేకుండా పోతుందని, జిల్లా విద్యాశాఖ అధికారి ,మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతూ వారు చేసే దోపిడీపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.


సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజుల దోపిడి అరికట్టడానికి కఠిన చట్టాల అమలు చేయడం లేదని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఒక చానల్ ఇంటర్వ్యూలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4000కు కుదిస్తామని మాట్లాడటం ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేసే కుట్రఅని , రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విద్య బలోపేతం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆరుట్లలో ప్రారంభం చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను రాష్ట్రమంతా నిర్మాణాలు చేయాలని , బిజెపి ఎమ్మెల్సీ పాఠశాల ప్రారంభోత్సవానికి పోయి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రవేట్ విద్యా ప్రోత్సహించారని, రేవంత్ రెడ్డి తమిళనాడు మాదిరిగా తెలంగాణలో ఫీజుల దోపిడీ అరికట్టాలని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పై ఏసిబి ,ఐటి తనిఖీలు నిర్వహించి విద్యార్థుల తల్లితండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేసిన సొమ్మును కక్కించాలని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై ప్రత్యక్ష ఆందోళన చేస్తామని, అధికారులు స్పందించకుంటే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేవిధంగా ఉద్యమిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని మణికంఠ రెడ్డి ,పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు గ్యార నరేష్, బానోత్ రఘురాం, రెహమాన్, లెనిన్, రాష్ట్ర నాయకులు చైతన్య యాదవ్, అన్వర్, శాంతి కుమార్, దత్తు రెడ్డి, ఆకాష్ నాయక్, హరీష్ , అనిల్, అరుణ్, జోసెఫ్ భాను, అవినాష్, లోకేష్, నవీన్, విజయ్, శ్రీను, రాహుల్, లింగం, అస్లాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *