Skip to content
తాజా
మే నెలలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. స్థిరంగా సాగుతున్న పన్నుల ఆదాయం.. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరల బాదుడు..వాణిజ్య సిలిండర్ల ధరలను రూ. 19 పెంచిన ఐవోసీ.. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. 37కి చేరిన మొత్తం జడ్జీల సంఖ్య.. శాంతి చర్చల మధ్య నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రమైన దాడులు.. జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త.. సీబీఎస్‌ఈ లక్ష్యంగా విరుచుకుపడిన రాహుల్ గాంధీ.. మేలో మార్కెట్లకు భారీ షాక్.. రూ. 55 వేల కోట్ల విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో దలాల్ స్ట్రీట్ కుదేల్.. ఎవరి తరఫునైనా లంచం డిమాండ్ చేస్తే అది కూడా నేరమే.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. జమిలి ఎన్నికలపై కీలక అప్‌డేట్.. 2029లో ఒకేసారి 20 రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. గుజరాత్ టైటాన్స్‌ ప్లేయర్లకు తప్పిన పెను ప్రమాదం.. టీమ్ ప్రయాణిస్తున్న బస్సులో ఎగసిన మంటలు.. రెండోసారి ఐపీఎల్ కప్పు ఎగరేసుకుపోయిన ఆర్సీబీ..ఫైనల్లో గుజరాత్‌పై ఘన విజయం మే నెలలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. స్థిరంగా సాగుతున్న పన్నుల ఆదాయం.. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరల బాదుడు..వాణిజ్య సిలిండర్ల ధరలను రూ. 19 పెంచిన ఐవోసీ.. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. 37కి చేరిన మొత్తం జడ్జీల సంఖ్య.. శాంతి చర్చల మధ్య నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రమైన దాడులు.. జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త.. సీబీఎస్‌ఈ లక్ష్యంగా విరుచుకుపడిన రాహుల్ గాంధీ.. మేలో మార్కెట్లకు భారీ షాక్.. రూ. 55 వేల కోట్ల విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో దలాల్ స్ట్రీట్ కుదేల్.. ఎవరి తరఫునైనా లంచం డిమాండ్ చేస్తే అది కూడా నేరమే.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. జమిలి ఎన్నికలపై కీలక అప్‌డేట్.. 2029లో ఒకేసారి 20 రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. గుజరాత్ టైటాన్స్‌ ప్లేయర్లకు తప్పిన పెను ప్రమాదం.. టీమ్ ప్రయాణిస్తున్న బస్సులో ఎగసిన మంటలు.. రెండోసారి ఐపీఎల్ కప్పు ఎగరేసుకుపోయిన ఆర్సీబీ..ఫైనల్లో గుజరాత్‌పై ఘన విజయం
బిజినెస్ వార్తలు

మే నెలలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. స్థిరంగా సాగుతున్న పన్నుల ఆదాయం..

Prajapaksham 01 Jun 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
మే నెలలో రూ.1.94 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. స్థిరంగా సాగుతున్న పన్నుల ఆదాయం..

దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు స్థిరమైన వృద్ధిని కనబరుస్తూ నిలకడగా కొనసాగుతున్నాయి. 2026 మే నెలకు సంబంధించిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1.94 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది (2025) మే నెలలో వసూలైన రూ.1.88 లక్షల కోట్లతో పోల్చి చూస్తే.. ఈసారి ఆదాయంలో 3.2 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.

పన్ను రీఫండ్‌లను (రీఫండ్‌ల సర్దుబాటు) మినహాయించిన తర్వాత మే నెలలో లభించిన నికర జీఎస్టీ ఆదాయం రూ.1.67 లక్షల కోట్లుగా నిలిచింది. ఇది కూడా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3.3 శాతం అదనం. అయితే, అంతకుముందు నెల అయిన 2026 ఏప్రిల్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయిలో ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల వసూళ్లు సాధించగా, దానితో పోలిస్తే మే నెలలో ఆదాయం కొంత తగ్గింది. ప్రతి సంవత్సరం మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసిన తదుపరి నెలల్లో (మే నెలలో) వసూళ్లు సాధారణ స్థాయికి తగ్గడం సహజమేనని ఆర్థిక శాఖ అధికారులు వివరించారు.

ఈసారి జీఎస్టీ వసూళ్ల సరళిని గమనిస్తే దేశీయ లావాదేవీల కంటే దిగుమతులే అత్యంత కీలక పాత్ర పోషించాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 2.6 శాతం తగ్గి సుమారు రూ.1.34 లక్షల కోట్లుగా నమోదు కాగా, దిగుమతులపై వచ్చే జీఎస్టీ వసూళ్లు మాత్రం ఏకంగా 19.1 శాతం భారీ వృద్ధితో రూ.59,654 కోట్లకు చేరుకోవడం గమనార్హం. అలాగే మే నెలలో ప్రభుత్వం జారీ చేసిన మొత్తం రీఫండ్‌లు 2.6 శాతం పెరిగి రూ.27,281 కోట్లుగా ఉన్నాయి.

మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి రెండు నెలల కాలానికి (ఏప్రిల్ , మే) కలిపి దేశంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 6.2 శాతం వృద్ధి రేటుతో రూ.4.37 లక్షల కోట్ల మార్కును చేరి, దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *