Telangana Graduate MLC Elections: రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్.. అభ్యర్థుల ఎంపికపై కవిత కీలక వ్యాఖ్యలు
Telangana Graduate MLC Elections
Telangana Graduate MLC Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సామ రామ్మోహన్ రెడ్డిని, నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తర్వాత ఈ పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించింది.
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేయనున్న సామ రామ్మోహన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ విభాగం చైర్మన్‌గా, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అలాగే కాంగ్రెస్ లీగల్ సెల్లోనూ, పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వివిధ బాధ్యతలు నిర్వహించారు.
ఇక నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందినవారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడైన సర్వోత్తమ్ రెడ్డి యూత్ కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఏఐసీసీ సభ్యుడిగా కూడా ఉన్న ఆయన నల్గొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
అభ్యర్థుల ఎంపికపై కవిత విమర్శలు
కాంగ్రెస్ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరినీ ఎంపిక చేయడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ నిర్ణయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకూ ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేయడం సామాజిక అన్యాయమని ఆమె ఆరోపించారు. బలహీన వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీలపై ఉంటుందని కవిత పేర్కొన్నారు. ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ చర్చ మొదలైంది.
మార్చిలో ముగియనున్న ప్రస్తుత సభ్యుల పదవీకాలం
ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రస్తుత సభ్యుల పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు ఇప్పటికే ప్రారంభమైంది. తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 30న ప్రచురించనున్నట్లు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడంతో రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల సమీకరణాలు మరింత స్పష్టమయ్యాయి. ఇక ఇతర రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
- Amit Shah VS Abhijit Dipke: 2029లో గెలుపుపై ముందే ధీమానా? అమిత్ షా మాటల్లోనే దొంగతనం బయటపడింది..దిప్కే కౌంటర్..
- Rahul Gandhi Petition: రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా.. 14 లోపాలు గుర్తించిన రిజిస్ట్రీ
- Mamata Banerjee: మమతా బెనర్జీ నివాసం వద్ద కత్తితో మహిళ హల్చల్.. దాడికి యత్నించిందని టీఎంసీ ఎంపీ ఫిర్యాదు
- LB Nagar Double Decker Corridor: ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్‌కు మరో కీలక ప్రాజెక్టు!
- CM Revanth Reddy: సీఎం రేవంత్ లాజిక్ కు బీజేపీ షాక్: జనాభా పెరుగుతుంటే.. 13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి?