డయల్ 100కు గుడ్‌బై.. తెలంగాణలో అత్యవసర సేవలకు ఇక నుంచి 112 మాత్రమే
CV Anand
తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రమాదాలు, ఆపద సమయాల్లో సత్వర సాయం అందించేందుకు డయల్ 100 స్థానంలో ఇకపై అమల్లోకి వస్తున్న 112 అత్యవసర సేవా నంబర్‌ను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు.
ఇప్పటివరకు పోలీసు సహాయం కోసం డయల్ 100, అంబులెన్స్ కోసం 108, అగ్నిమాపక సేవల కోసం 101 ఇలా వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సి వచ్చేది. కానీ తాజాగా అందుబాటులోకి వచ్చిన దేశవ్యాప్త ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్’ (ERSS – 112) ద్వారా అన్ని అత్యవసర సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు.
పోలీస్ సహాయం
అంబులెన్స్ సేవలు
అగ్నిమాపక సేవలు (ఫైర్)
ఆపదలో ఉన్న ప్రజలు 112కు కాల్ చేయగానే కాంటాక్ట్ సెంటర్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ప్రమాద స్వరూపాన్ని బట్టి సంబంధిత విభాగాలకు (పోలీస్, మెడికల్, ఫైర్) సమాచారాన్ని అందించి, ఘటనా స్థలానికి తక్షణమే వాహనాలు చేరుకునేలా సమన్వయం చేసేలా ఈ నూతన సాంకేతిక వ్యవస్థను డిజైన్ చేశారు. బాధితులకు వేగవంతమైన సాయం అందించడమే లక్ష్యంగా ఈ సేవలు రూపుదిద్దుకున్నాయి.
- Erravalli Lands: ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సర్వే నంబర్ 325లో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణానికి ఆదేశం..
- Bathukamma Celebrations 2026: బతుకమ్మ పండుగ తేదీలు.. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 వరకు 9 రోజులు పాటు ఉత్సవాలు.. ఏ రోజు ఏ పేరుతో పిలుస్తారంటే..
- Telangana ACB Bribe Cases: అవినీతి సొమ్ముతో ఏసీబీకి అడ్డంగా దొరుకుతున్న అధికారులు.. రూ.4 లక్షల లంచంతో GHMC అధికారి, రూ.1 లక్ష కేసులో DMHO అరెస్ట్..
- Who is Neha Bora? ఎవరీ నేహా బోరా..? జంతర్ మంతర్ ఆందోళనల్లో మెరిసిన ధిక్కార స్వరం.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి?
- Dussehra 2026: దసరా తొలి రోజు అమ్మవారి అవతారం.. శైలపుత్రి దేవి వెనుక కథ ఇదే..