Sonam Wangchuk Health Update: 23 రోజుల పాటు నిరాహార దీక్షలో సోనమ్ వాంగ్‌చుక్.. దీక్షమానేస్తే రీఫీడింగ్ సిండ్రోమ్ ప్రమాదంతో 10 రోజుల పాటు భోజనానికి దూరంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక..
Sonam Wangchuk Health Update: 23 రోజుల నిరాహార దీక్షను ముగించిన సోనమ్ వాంగ్‌చుక్.. రీఫీడింగ్ సిండ్రోమ్ ప్రమాదంతొ 10 రోజుల పాటు భోజనానికి దూరంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక..
Sonam Wangchuk Health Update: హస్తినను కుదిపేసిన నీట్-యూజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంపై గత 23 రోజులుగా కొనసాగుతున్న ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిపిన చర్చలు సఫలం కావడంతో వాంగ్‌చుక్ తన దీక్షను విరమించుకున్నట్లు అనుకున్నా.. సీజేపీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే ఒకవేళ దీక్ష విరమిస్తే.. సుదీర్ఘ కాలం పాటు ఆహారానికి దూరంగా ఉన్న వాంగ్‌చుక్ వెంటనే సాధారణ భోజనం తినవచ్చా అంటే.. వైద్య నిపుణులు ఖచ్చితంగా తినకూడదని హెచ్చరిస్తున్నారు.
వారాల తరబడి ఉపవాసం లేదా దీక్ష చేసిన తర్వాత శరీరం ఒక్కసారిగా సాధారణ ఆహారాన్ని జీర్ణం చేసుకునే స్థితిలో ఉండదు. వెంటనే ఘనపదార్థాలు లేదా భారీ కేలరీల ఆహారం తీసుకుంటే అది రీఫీడింగ్ సిండ్రోమ్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది. శరీర జీవక్రియలో (Metabolism) ఆకస్మిక మార్పులు రావడం వల్ల ఎలక్ట్రోలైట్స్ (పొటాషియం, ఫాస్ఫేట్, మెగ్నీషియం), ద్రవాల సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుంది. అందుకే వాంగ్‌చుక్ రాబోయే 7 నుండి 10 రోజుల వరకు సాధారణ భోజనానికి దూరంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
మొదటి మూడు రోజులు కేవలం ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ORS) నీరు, పలచబరిచిన పండ్ల రసాలు లేదా పలచని కూరగాయల సూప్‌లు మాత్రమే ఇవ్వాలి. ఈ సమయంలో పొటాషియం, ఫాస్ఫేట్ స్థాయిలను వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తారు. 4 నుండి 6వ రోజులు సులభంగా జీర్ణమయ్యే, తక్కువ కొవ్వు ఉండే పలుచని బియ్యపు గంజి (కంజి), పెరుగు లేదా బాగా గుజ్జు చేసిన పండ్లను చిన్న చిన్న మోతాదులలో రోగికి అందిస్తారు. 7 నుండి 10వ రోజులు పాటు రక్త పరీక్షలలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు స్థిరంగా ఉన్నట్లు తేలితే.. ఉడికించిన కూరగాయలు, పప్పు, కిచిడీ వంటి మెత్తటి ఆహారాలను క్రమంగా పరిచయం చేస్తూ కేలరీలను పెంచుతారు. 10వ రోజు తర్వాత జీవక్రియ పూర్తిగా స్థిరపడిందని వైద్య బృందం నిర్ధారించిన తర్వాతే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన పూర్తి సాధారణ భోజనాన్ని సురక్షితంగా ప్రారంభించవచ్చు.
ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.