Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

గోండుల సూర్యుడు… కొమరం భీమ్‌

Prajapaksham 08 Oct 2026 0 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
గోండుల సూర్యుడు… కొమరం భీమ్‌

Komaram Bheem

-తాళ్లపల్లి యాదగిరి గౌడ్‌.

1724 నుంచి 1940 (1948) వరకు అనగా అసఫ్జా నిజాం ఉల్మూల్క్‌ నుంచి 9వ(చివరి) నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ బహదూర్‌ దాకా 9 మంది నిజాం నవాబుల సుమారు 224 ఏళ్ల దుష్ట పాలన కాలంలో నిజాం హైదరాబాద్‌ రాజ్యంలోని ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ అటవీ ప్రాంత గ్రామాల్లో అడవి బిడ్డలకు అడవి మీద ఏమాత్రం అధికారం లేదు. అడవిలో కనీసం పుల్ల కూడా ముట్టుకోరాదు. కట్టుకునేందుకు గోచీలు తప్ప అంగీలు లేవు. అడవి బిడ్డలు చేసుకున్న కష్టఫలాన్ని ఉద్యోగులు గద్దర్ల తన్నుకు పోతారు. అధికారులు, పోలీసులు, పట్వారిలు, పటేళ్లు, దొరలు, పెత్తందార్ల దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీలు, అత్యాచారా లు, మానభంగాలు, హత్యలు, చిత్రహింసలు అంతా ఇంతా కావు. హింసించి పట్టి పేరా బలవంతంగా డబ్బులు దోచుకునేవారు. ఇలా అడవి బిడ్డలు రాక్షస పాలనలో అనుభవిస్తున్న కష్టాలు చూసి సర్కారుపై కొమరం భీమ్‌ రగిలిపోయాడు. తన గోండు జాతి జనులను కాపాడుకోవడానికి దుష్ట నిజాం నవాబుతో యుద్ధానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గోండులందరిని ఏకం చేయాలనుకున్నాడు. వాళ్ల హక్కులను అడవులపై వారికి గల అధికారాలను నిజాం నవాబు పై యుద్ధం చేసి గెలుచుకొని వారికి సుఖశాంతులను ఇవ్వాలని తనకు తాను కర్తవ్య బోధ చేసుకున్నాడు. తన అనుచరులైన కురిసెంగ సాము, జుమ్నాక పైకు, కుమార లింగు, ఆత్రం రఘు, మడావి సోము, జాకో, కరిపెత్త బాదు, రాజు పటేల్‌, సీడం భూజీరావు, సోనేరావులతో కూడిన 500మంది సైనికులను తయారు చేశాడు. వారికి ఆయుధాలుగా తుపాకులు, కత్తులు, గుత్పలు ఇచ్చాడు. అడవి బిడ్డల హక్కులైనా ఆదివాసీల స్వయంపాలన ‘జల్‌ జంగల్‌ జమీన్‌” సాధన నినాదంతో పదేళ్లకు పైగా 1931 నుంచి 1940 అక్టోబర్‌ 8 దాకా అమర త్వం పొందే వరకు ఆసిఫాబాద్‌ పరిసర ప్రాంతాలైన జోడేఘాట్‌, బాబే జరి, పట్నాపూర్‌, టోకెన్ల వాడ, చల్‌ భరిడి, శివ గూడా, భీమన్‌ గోంది, కల్లెగావ్‌, అంకుతాపూర్‌, నర్సాపూర్‌, కోషగూడ, లైన్‌ టవల్‌ అనే 12 గూడేల ఆదివాసీల స్థితిగతులను మార్చి వారికి బంగారు జీవితాలను ప్రసాదించడాని కి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచుకొని తిరుగులేని గెరిల్ల యుద్ధ వ్యూహంతో సమరం సాగించా డు. కాగా కొమురం భీం 1901 అక్టోబర్‌ 22న పుట్టాడు. 39 ఏళ్ల వయసులో గోండుల కోసం సాగించిన విప్లవోద్యమంలో నేలకొరిగాడు. కాగా మా మిత్రులు ప్రముఖ దర్శక నిర్మాత అల్లాని శ్రీధర్‌ కొమరం భీమ్‌ చిత్రాన్ని నిర్మించి భీమ్‌ వీరోచిత గాథ ను ప్రపంచానికి తెలిపారు. ఈ చిత్రం జాతీయ సమగ్రత చిత్రం గా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు గాను ఎంపిక కాగా శ్రీధర్‌కు 2 నంది అవార్డులను తెచ్చి పెట్టింది.