Skip to content
ప్రపంచం › వార్తలు

అంగరంగ వైభవంగా ఫ్రెంచి కమ్యూనిస్టు పత్రిక ‘లీమ్యానిటే’ ఉత్సవం

Prajapaksham 26 Sep 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
అంగరంగ వైభవంగా ఫ్రెంచి కమ్యూనిస్టు పత్రిక ‘లీమ్యానిటే’ ఉత్సవం

Grand celebrations for the French Communist newspaper ‘L’Humanité’

అధ్యక్ష ఎన్నికలకు ముందు వామపక్షాల్లో ఉత్తేజం నింపిన వేడుక
ల్యూక్‌ రొటెల్లో, మాత్‌ విస్‌న్యూస్కీ
‘నేను ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటాను. తమ జీవనోపాధిని రక్షించుకునేందుకు పోరాడేవారి పక్షాన, తమ పిల్లలకు తిండి పెట్టటానికి, బిల్లులు చెల్లించటానికి గౌరవం కోసం పోరాడేవారి పక్షాన ఉంటాను,’ అని గత వారాంతం లో వేలాది మంది ప్రజల సమక్షంలో ఫ్రెంచ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (పిసిఎఫ్‌)జాతీయ కార్యదర్శి ఫాబియన్‌ రౌసెల్‌ ప్రకటించారు. ‘అడ్డంకులు ఉన్నప్పుడు నేను ఏ పక్షాన ఉన్నానో నాకు తెలుసు.’
సెప్టెంబర్‌ 11 నుండి 13 వరకు జరిగిన పిసిఎఫ్‌ అనుబంధ దినపత్రిక ‘ లీమ్యానిటే’(L’HUMANIT) 91వ ‘ఫెట్‌ డి లీమ్యానిటే’ ఉత్సవంలో రౌసెల్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్‌ నలుమూలలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 5 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సవాలు, సంగీతం రాజకీయ చర్చల కోసం హాజరయ్యారు. 2027లో జరగబోయే ఫ్రెంచ్‌ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని రౌసెల్‌ అధికారికంగా ప్రకటించిన వేదిక కూడా ఇదే.
ఈ ఉత్సవం ఇతివృత్తం, 1936లో పాపులర్‌ ఫ్రంట్‌ చేసి న ప్రకటనను గుర్తు చేసింది. అది ఐరోపాలో ఫాసిజం పెరుగుదలకు వ్యతిరేకంగా ఏకమైన కమ్యూనిస్టు, సోషలిస్టు, ప్రజాస్వామ్య శక్తుల ఒక విస్తృత ఫాసిస్టు వ్యతిరేక కూటమి. కార్మిక సంఘాల సమీకరణ, భారీ ప్రదర్శనలు, ఎన్నికల పోరాటం ద్వారా తిరుగుబాటు చేసిన పాపులర్‌ ఫ్రంట్‌ పచ్చి మితవాద ఉద్యమాన్ని ఓడించింది.
ప్రభుత్వాన్ని దాని ఎన్నికల వాగ్దానాలకు జవాబుదారీ గా ఉంచుతూ, కార్మిక సంఘాలు, కార్మికులు తమ డిమాండ్ల కోసం సమీకరణ, ఆందోళనను కొనసాగించారు. తద్వారా ఫ్రాన్స్‌లో ఆధునిక కార్మిక, ప్రజాస్వామ్య హక్కులకు మూలస్తంభాలను సాధించారు. 2024లో జరగబోయే ఆకస్మిక
(స్నాప్‌) ఎన్నికలలో పార్లమెంటులో పచ్చి మితవాద పార్టీల కు మెజారిటీ వచ్చే ప్రమాదం మళ్లీ తలెత్తడంతో, ఫ్రాన్స్‌లోని ప్రధాన కార్మిక సంఘాల సమాఖ్యలు ఏకమై ‘న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ (ఎన్‌ఎఫ్‌పి)’ ఏర్పాటుకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా మధ్యేవాద వామపక్ష శక్తులు ఏకమై ఒకే పార్లమెంటరీ అభ్యర్థుల జాబితాను, ఉమ్మడి రాజకీయ కార్యక్రమాన్ని ప్రకటించాలి. యూరోపియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల సమయం లో గత కూటమి విచ్ఛిన్నమైంది. దీంతో, పచ్చి మితవాద పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ఉన్నప్పటికీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మ్యాక్రాన్‌ పార్లమెంటును రద్దు చేశారు. కమ్యూనిస్ట్‌ పార్టీ (పిసిఎఫ్‌), సోషలిస్ట్‌ పార్టీ (పిఎస్‌), పాపులిస్ట్‌ ఫ్రాన్స్‌ ఇన్సౌమిస్‌ (ఎల్‌ఎఫ్‌ఐ), గ్రీన్స్‌ (ఇఇఎల్‌వి), ఇతర చిన్న పార్టీలతో కూడిన ఎన్‌ఎఫ్‌పి అనూహ్య విజయా న్ని సాధించి, నేషనల్‌ అసెంబ్లీలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. తద్వారా ఫాసిస్ట్‌ నేషనల్‌ ర్యాలీ (ఆర్‌ఎన్‌)కి, మ్యాక్రాన్‌ నయా ఉదారవాద మిత్రపక్షాలకు మెజారిటీ రాకుండా అడ్డుకుంది.
అయితే, ఈ కూటమి ప్రధానమంత్రి పదవికి తమ తరఫు న ఏకాభిప్రాయ అభ్యర్థిని నియమించలేకపోయింది. అలాగే ఫ్రెంచ్‌ అధ్యక్ష పదవి అపారమైన శక్తిని సమతుల్యం చేయలేకపోయింది. ఇది ప్రస్తుత రాజకీయ అస్థిరత, పొదుపు చర్యలు, సైనికీకరణ, పెరుగుతున్న తీవ్ర మితవాద పక్ష భావజాలానికి దారితీసింది. ఇప్పుడు తదుపరి అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, డజన్ల కొద్దీ ఇతర పార్టీ నాయకులతో పాటు అవినీతి ఆరోపణలపై దోషిగా తేలినప్పటికీ, చట్టపరమైన సాంకేతిక కారణాలతో పోటీ చేయడానికి అనుమతించబడిన ఆర్‌ఎన్‌ నాయకురాలు మెరైన్‌ లీ పెన్‌, ఇటీవలి అభిప్రాయ సేకరణలలో స్పష్టమైన ముందంజలో ఉన్నారు.
పిసిఎఫ్‌, లీ మ్యానిటే సంయుక్తంగా నిర్వహించిన ‘ఫెట్‌ డి లీ మ్యానిటే’ పాపులర్‌ ఫ్రంట్‌ చారిత్రక స్మృతులలోకి తిరిగి రావడం ద్వారా, కార్మిక వర్గ నాయకత్వం కింద వివిధ శక్తు ల విస్తృత ఐక్యత ద్వారా మార్గాంతరాన్ని చూపింది.
ఈ ఉత్సవ ప్రాంగణమంతా వ్యాపారుల స్టాల్స్‌, దేశంలో ని ప్రతి పిసిఎఫ్‌ ప్రాంతీయ శాఖ, పాపులర్‌ ఫ్రంట్‌ రాజకీయ మిత్రులతో పాటు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల కోసం కేటాయించిన ఒక పెద్ద భాగంతో నిండిపోయింది. ఏంజెలా డేవిస్‌, నీనా సిమోన్‌, జోసెఫిన్‌ బేకర్‌ల పేరిట ఏర్పాటు చేసిన వేదికలపై అనేకమంది నల్లజాతి, ఎల్‌జిబిటిక్యూ+, కార్యకర్త కళాకారుల సంగీత ప్రదర్శనలు జరిగాయి. అదే సమయం లో, ఉత్సవ వీధులు, స్టాల్స్‌ తాజా ఆహారం, ఆకస్మిక కరోకే, నృత్య ప్రదర్శనలు, కార్నివాల్‌ ఆకర్షణలు, ఇంకా మరెన్నో వాటితో నిండిపోయాయి. ఫ్రెంచ్‌ చీజ్‌లు, సెనెగలీస్‌ పౌలెట్యాస్సా, సూడానీస్‌ పప్పు రసం, లెక్కలేనన్ని ఇతర ప్రధాన వీధి ఆహారాల సువాసనలు గాలిలో తేలియాడాయి. వివిధ వాయిద్యాల, సంగీత సంప్రదాయాల శబ్దాలు గాలిలో మిళితమవుతుండగా, ఆకస్మిక ప్రదర్శనలు వాటిని జనసమూహాల గుండా తీసుకువెళ్ళాయి.
ఉత్సవాలు, రాజకీయాలు విడదీయరానివిగా మారాయి. పిసిఎఫ్‌ స్టాల్స్‌ పార్టీ కోసమే కాకుండా, వారి ఫెడరేషన్‌లలో జరుగుతున్న వివిధ సంఘీభావ ప్రయత్నాల కోసం కూడా నిధులు సేకరించాయి. ఫ్రాన్స్‌లోని అతిపెద్ద యూనియన్‌ల లో ఒకటైన సిజిటి ప్రధాన కేంద్రంలో చర్చలు జరిపి, యూనియన్‌ సమాచారాన్ని పంపిణీ చేసింది. ఇది తరచుగా ఆహారం, పానీయాలు తీసుకువెళ్తున్న ఆసక్తిగల బాటసారులను ఆకర్షించింది. గాయకులు, నృత్యకారులు తమ ప్రదర్శనల మధ్య విరామాలలో నల్లజాతి, ట్రాన్స్‌జెండర్‌ ప్రజల జీవితాల కు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు లేదా ప్రేక్షకుల మధ్య ‘ఫ్రీ పాలస్తీనా’ అనే నినాదాలు ప్రారంభించారు.
పాపులర్‌ ఫ్రంట్‌తో అనుబంధంగా ఉన్న అనేక లాభాపేక్షలేని, సామాజిక కార్యక్రమాల సంస్థలు కూడా హాజరయ్యాయి. వీటిలో ఎల్‌జిబిటిక్యూ+, పర్యావరణ న్యాయం, పౌర హక్కు ల సంస్థలు కూడా ఉన్నాయి. కొంతమంది వాలంటీర్లు, ఇటీవల ఫ్రెంచ్‌ శాసనసభ ఆమోదించిన ‘చంపే హక్కు’ (రైట్‌- టు -కిల్‌)చట్టాన్ని హైలైట్‌ చేస్తూ హాజరైన వారికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ చట్టం ప్రకారం, దేశవ్యాప్తంగా పోలీసులకు కాల్పులు జరిపేటప్పుడు పెక్కుస్థాయిలో విచక్షణాధికారం లభిస్తుంది. కోర్టులో వారిపై విచారణ చాలా వరకు తగ్గుతుంది.
మరికొందరు అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా క్యూబాకు మద్దతు ఇచ్చే మార్గాలతో కూడిన గ్రాఫిక్స్‌, స్థానిక ఆసుపత్రుల మూసివేత గురించిన సమాచారం, కొత్త దేశీయ వ్యవసాయ కార్యక్రమాలపై కరపత్రాలను పంచుకున్నారు.
పిసిఎఫ్‌ సభ్యుల్లో, ఉత్సవానికి హాజరైన వారిలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సైనిక- ఆధారిత ఆర్థిక వ్యవస్థ, అమెరికాపై ఆర్థికంగా ఆధారపడటం, ప్రపంచంలోని ఇతర దేశాలతో దాని సంబంధాలు.
ఫ్రాన్స్‌ ప్రస్తుతం ‘డీ- ఇండస్ట్రియలైజేషన్‌’ (పరిశ్రమల మూసివేత) ప్రక్రియను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా కొన్ని పరిశ్రమలు యూరోపియన్‌ యూనియన్‌ సరిహద్దుల ఆవలకి తరలించబడుతున్నాయి. అలాగే అంతర్జాతీయ గుత్తాధిపత్య సంస్థలకు అనుకూలంగా యూనియన్‌ పరిధిలోని ఉత్పత్తి వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు.
అదే సమయంలో, దేశీయ పరిశ్రమలలో తగ్గుతున్న లాభాల రేట్లను పునరుద్ధరించే ప్రయత్నంలో మ్యాక్రాన్‌ ప్రభుత్వం కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడికి దిగింది. 2023లో తిరోగమన విధానాలతో కూడిన పెన్షన్‌ సంస్కరణలను బలవంతంగా ఆమోదించడంతో దేశవ్యాప్త సమ్మెలు జరిగి, లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దీని అమలుకు సంబంధించిన కొన్ని అంశా లు తాత్కాలికంగా నిలిపివేయబడినప్పటికీ, కార్మికుల సామాజిక భద్రతలను పునరుద్ధరించడానికి, మెరుగుపరచడానికి ఫ్రాన్స్‌ కార్మిక సంఘా లు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉత్సవం రెండవ రోజున రౌసెల్‌ ప్రసంగాన్ని వినడానికి 40,000 మందికి పైగా ప్రజలు ‘ఏంజెలా డేవిస్‌ స్టేజ్‌’ వద్ద ఉన్న మైదానంలో గుమిగూడారు. పార్టీ నాయకుల సమక్షం లో ఆయన మ్యాక్రాన్‌ ప్రభుత్వ సైనిక, ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శించారు, ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలను జాతీయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పా రు. అలాగే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు ముఖ్యంగా క్యూబా, పాలస్తీనాలకు అంతర్జాతీయ సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.
పిసిఎఫ్‌ 40వ కాంగ్రెస్‌ రూపొందించిన ప్రధాన విధాన పత్రంలోని ‘విజయాల కమ్యూనిజం’ (communism of conque sts) అనే సూత్రం ఆధారంగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి రౌసెల్‌ నామినేట్‌ చేయబడ్డారు.ఆయన అభ్యర్థిత్వం పార్టీ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఇది పార్టీ సభ్యులు, శాఖ లు, ఎన్నికైన ప్రతినిధులు, మిత్రపక్షాలను ఒక ఉమ్మడి వేదిక, లక్ష్యం వైపు సమీకరించింది. 2022లో ఆయన చేపట్టిన అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు 8,00,000కు పైగా ఓట్లు (2.3%)సాధించారు. 15 ఏళ్ల విరామం తర్వాత పార్టీ స్వతంత్రంగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం అదే మొదటిసారి.
అయితే, అధ్యక్ష ఎన్నికల ప్రచారం మాత్రమే పిసిఎఫ్‌ ఏకైక లక్ష్యం కాదని రౌసెల్‌ స్పష్టం చేశారు. ఉత్సవ సమయంలోనూ, ఆ తర్వాతి రోజుల్లోనూ మ్యాక్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, దేశ ఇంధన రంగంపై పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి రౌసెల్‌ ముఖ్య ఆకర్షణగా నిలిచినప్పటికీ, పలువురు ఇతర అధ్యక్ష అభ్యర్థులు, అలాగే తమ అభ్యర్థుల ను నిలబెట్టాలనుకుంటున్న పార్టీలు కూడా హాజరయ్యాయి. అధ్యక్ష పదవికి నాలుగోసారి పోటీ చేస్తున్న ఎల్‌ఎఫ్‌ఐ నాయకుడు జ్యా లిక్‌ మెల్షన్‌ ప్రారంభ రోజున తన ప్రసంగంతో భారీ జనసమూహాన్ని ఆకర్షించారు. ప్రస్తుతం మెల్షన్‌ ఇత ర నయా ఉదారవాద అభ్యర్థుల కంటే స్వల్పంగా ముందంజలో ఉండి, పోల్స్‌లో లీపెన్‌ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు.
సెంటర్‌- అభ్యర్థుల ప్రైమరీని నిర్వహిస్తూ, పోల్స్‌లో రెండంకెల మద్దతు పొందుతున్న పిఎస్‌ పార్టీ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంది. ఈ మూడు రోజుల పాటు ఇఇఎల్‌వి, చిన్న ట్రాట్సీయిస్ట్‌ పార్టీల అధ్యక్ష అభ్యర్థులు కూడా హాజరయ్యారు.
ఇంత విస్తృత శ్రేణి రాజకీయ సంస్థల ఉనికి కొన్ని ఘర్షణలకు దారితీసింది. ఎల్‌ఎఫ్‌ఐకి చెందిన కొందరు కార్యకర్త లు పిఎస్‌ స్టాల్‌ బయట నిరసన తెలిపారు. మరికొందరు రౌసెల్‌, పిసిఎఫ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిని పిసిఎఫ్‌ సభ్యులు, కొందరు ముఖ్యమైన ఎల్‌ఎఫ్‌ఐ ప్రతినిధు లు స్వయంగా ఖండించారు.
ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, పిసిఎఫ్‌, లీ మ్యానిటే, అనేక ప్రము ఖ సంగీత బృందాలు ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య తా సందేశాన్ని ముందుకు తీసుకువెళ్లాయి. ఈ కార్యక్రమా లు ఉత్సవం అంతటా అనేక సమయాల్లో లక్షలాది మందిని ఒకచోట చేర్చాయి. సంగీత కచేరీల సమయంలో, రూసెల్‌ చొక్కాలు, మెల్షన్‌ జెర్సీలు ధరించిన వేలాది మంది పాలస్తీనా, కనాకీ జెండాలను ఊపుతూ, ‘సియామోటుట్టియాంటిఫాసిస్టి!’ (మేమంతా ఫాసిస్ట్‌ వ్యతిరేకులం!) అని నినాదాలు చేస్తూ ఏకమయ్యారు. ఉమ్మడి కార్మికవర్గ డిమాండ్లను ముందుకు తీసుకెళ్ల డం, ఫాసిస్ట్‌ మితవాదాన్ని ఓడించడం అనే సందేశంతో జరిగిన ముగింపు కార్యక్రమానికి, ఏంజెలా డేవిస్‌ వేదిక చుట్టూ లక్షలాది మంది తరలివచ్చారు.
చిన్న చిన్న సందర్భాలలో కూడా ఒక రకమైన ఆశాభావం వెల్లివిరిసింది. రౌసెల్‌ ప్రసంగిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు నినాదాలు చేస్తూ, ఉత్సాహపరుస్తుండగా, పిల్లలు గుంపు లో కలిసి ఆటలు ఆడుకుంటూ పరుగులు పెట్టారు. పైకెత్తిన పిడికిళ్లు, చిరునవ్వులు, కౌగిలింతలు, కరచాలనాల రూపంలో, ఈ సంఘీభావం దేశంలోని ఒక మూల నుంచి మరొక మూలకు, భాషలు, సరిహద్దులు, సముద్రాలను దాటి ప్రయాణించింది. పిసిఎఫ్‌, లీమ్యానిటే, సిజిటి, ఇతర ప్రగతిశీల శక్తులు వచ్చే ఏడాది ఎన్నికలు, ఆ తర్వాత కాలం వైపు చూస్తున్న తరుణంలో, కార్మికవర్గ ఐక్యత స్ఫూర్తి శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఈ ఉత్సవం స్పష్టం చేసింది.


(సౌజన్యం : పీపుల్స్‌ వరల్డ్‌)
ఫ్రెంచ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (పిసిఎఫ్‌)
జాతీయ కార్యదర్శి ఫాబియన్‌ రౌసెల్‌