CP Sajjanar Dance Video: సజ్జనార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్.. ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాటకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చిందులు..
CP Sajjanar Dance Video
CP Sajjanar Dance Video: హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్ నిమజ్జన మహోత్సవం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన సిబ్బందితో కలిసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ ఉత్సాహంగా నృత్యం చేశారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ‘ఆయా షేర్’ పాటకు ఆయన చిందులేయడం విశేషం. నిమజ్జన బందోబస్తు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతూ, అత్యున్నతాధికారి స్వయంగా తమతో కలిసి స్టెప్పులేయడంతో కిందిస్థాయి సిబ్బందిలో ఉత్సాహం రెట్టింపైంది.
మరోవైపు నిమజ్జనోత్సవం పూర్తి కావడంతో నగరంలో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను అధికారులు ఎత్తివేశారు. సచివాలయం పరిసర ప్రాంతాలైన ట్యాంక్‌బండ్, లిబర్టీ, అసెంబ్లీ తదితర మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో గురువారం ఉదయం నుంచి ఆయా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ యథాతథంగా సాగుతోంది.