హతమారుస్తామని ఇరాన్ బెదిరింపులు.. హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపించిన ట్రంప్ సీక్రెట్ ఎస్కేప్
Trump Escape
నాటో సమావేశాల్లో పాల్గొనేందుకు టర్కీ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ నుంచి ప్రాణహాని బెదిరింపులు రావడంతో.. అమెరికా భద్రతా వర్గాలు హాలీవుడ్ సినిమాను తలపించేలా ఒక అత్యంత రహస్య ఆపరేషన్ చేపట్టాయి. శత్రువుల దృష్టిని మళ్లించేందుకు ట్రంప్‌ను ఒక విమానంలోకి ఎక్కించినట్లే చేసి, అందరి కళ్లు గప్పి కేటరింగ్ ట్రక్కు ద్వారా మరొక సైనిక విమానంలోకి తరలించిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఖతార్ బహుకరించిన ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో టర్కీ చేరుకున్న ట్రంప్‌ను హతమారుస్తామంటూ ఇరానియన్ల నుంచి బెదిరింపులు రావడంతో పర్యటన ముగిశాక తిరుగు ప్రయాణంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్తానని ఆయన ప్రకటించారు. అయితే అంకారాలోని ఎసెన్‌బోగా అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు అత్యంత చాకచక్యంగా ప్లాన్ మార్చేశారు.
తొలుత మీడియా జనులందరి ముందూ ట్రంప్ పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి ఎక్కినట్లు నటించారు. విమానం లోపలికి వెళ్లిన వెంటనే.. ఎవరికీ అనుమానం రాకుండా ఆ విమానం వెనుక భాగంలో ఉన్న ఒక ఫుడ్ కేటరింగ్ ట్రక్కులోకి మారారు. ఆ కేటరింగ్ వాహనం నేరుగా సమీపంలో సిద్ధంగా ఉన్న ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ‘సీ-32ఏ’ మిలిటరీ విమానం వద్దకు వెళ్లగా, ట్రంప్ అందులోకి ప్రవేశించారు.
మరోవైపు విమానంలో ఉన్న జర్నలిస్టులు ఎవరూ కిటికీల తెరలు తీయకుండా అధికారులు జాగ్రత్తపడటంతో.. ట్రంప్ తమతోనే ప్రయాణిస్తున్నారని మీడియా ప్రతినిధులు భావించారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే అంకారా విమానాశ్రయం నుంచి రెండు ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలతో పాటు ట్రంప్ ఉన్న మిలిటరీ విమానం లండన్‌కు బయలుదేరాయి. ‘సీ-32ఏ’ విమానం బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ మిల్డెన్‌హాల్ స్థావరానికి చేరుకున్న తర్వాత, ట్రంప్ అక్కడ మళ్లీ తన పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి మారిపోయారు. ఇరాన్ నుంచి ఎదురైన ప్రత్యక్ష ముప్పు నేపథ్యంలో అమెరికా నిఘా వర్గాలు చేపట్టిన ఈ డెకాయ్ ఆపరేషన్ చూసి అంతర్జాతీయ భద్రతా విశ్లేషకులు విస్తుపోతున్నారు.
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్