Volcano Video: ఒక్కసారిగా బద్దలై ఉగ్రరూపం దాల్చిన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం.. ఆకాశంలో కిలోమీటర్ల మేర దట్టమైన బూడిద మేఘాలు..వీడియో ఇదిగో..
Volcano Video
Volcano Video: ఇండోనేషియాలోని ప్రముఖ అనక్ క్రాకటోవా (Anak Krakatoa) అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై ఉగ్రరూపం దాల్చింది. సుమారు 25 గంటల పాటు నిరంతరాయంగా లావా, విష వాయువులు, వేడి రాళ్లు, భారీగా బూడిదను వెదజల్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీని దెబ్బకు ఆకాశంలో కిలోమీటర్ల మేర దట్టమైన బూడిద మేఘాలు అలుముకోవడంతో దేశంలో రవాణా వ్యవస్థ, ముఖ్యంగా విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ విస్ఫోటనానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా రాజధాని జకార్తాలోని సోకర్నో-హట్టా, హలిమ్ పెర్దనకుసుమ అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా మొత్తం 8 ఎయిర్పోర్టులను రవాణా శాఖ తాత్కాలికంగా మూసివేసింది. దీనివల్ల సుమారు 2,300 విమాన సర్వీసులు రద్దు కావడం లేదా దారి మళ్లించడం జరిగింది. ఫలితంగా దాదాపు 2.70 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.