బల్లగుద్ది చెబుతున్నా.. ‘ఇరుముడి’ మీకు తెగ నచ్చేస్తుంది:
Irumudi
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ
మాస్ మహారాజా రవితేజ లేటేస్ట్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ఈ పాట.. అందరికీ సుపరిచితమైన అయ్యప్ప భక్తి గీతానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.అయ్యప్ప భక్తుల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ ‘మల్లెపూల పల్లకి’ పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ ‘ఇరుముడి’ కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కొత్త మ్యూజికల్ టచ్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్. నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. స్వాసిక నటన చూస్తే మీకు భయమేస్తుంది. అంత అద్భుతంగా చేసింది. నిజంగా కొన్ని క్యారెక్టర్స్ మీ మైండ్‌లో ఉండిపోతాయి. ఆగస్టు 21న సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మీరు ఒక డిఫరెంట్ సాయికుమార్ ని చూస్తారు. సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. జీవీ ప్రకాష్ బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. నక్షత్ర ఫ్యూచర్‌లో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది అని అన్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ ,నిర్మాత రవిశంకర్ ,డైరెక్టర్ బాబీ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్,బేబీ నక్షత్ర ,డైరెక్టర్ బుచ్చిబాబు సనా, ప్రొడ్యూసర్ ఎస్.కే.ఎన్, డైరెక్టర్ సాయి రాజేష్, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ పాల్గొన్నారు.
- IOCL Jobs: ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2026: 470 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Criminalisation of Politics: సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు.. 14 మంది సీఎంలపై క్రిమినెల్ కేసులు.. షాకిస్తున్న ప్రజాప్రతినిధుల కేసులపై తాజా గణాంకాలు
- సంబరాల ఏటిగట్టు షూటింగ్ పూర్తి-జనవరి 12 రిలీజ్
- బల్లగుద్ది చెబుతున్నా.. ‘ఇరుముడి’ మీకు తెగ నచ్చేస్తుంది:
- పారిశుద్ధ్య కార్మికులు మనుషులు కారా?