ఆగ్రాలో దారుణం.. ఏడాది కుమార్తెను యమునా నదిలోకి విసిరేసిన తండ్రి
Man Stops on Bridge for Selfie With Infant Daughter, Allegedly Throws Her Into Yamuna
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఏడాది వయసున్న కన్నకూతురిని యమునా నదిలోకి విసిరేసినట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బరా యమునా వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రింకు తన భార్య లక్ష్మి, ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి బైక్‌పై ఆగ్రా నగరంలో తిరిగేందుకు బయలుదేరాడు. ప్రయాణంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం అక్బరా వంతెన వద్ద రింకు బైక్‌ను ఆపాడు.
తన కుమార్తెతో సెల్ఫీ తీసుకుంటానని చెప్పి చిన్నారిని వెంట తీసుకుని వంతెన రెయిలింగ్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఫొటో తీసుకున్న అనంతరం పసికందును యమునా నదిలోకి విసిరేసినట్లు అతడి భార్య ఆరోపించింది.ఈ దృశ్యాన్ని చూసిన లక్ష్మి షాక్‌కు గురై వెంటనే భర్తను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. తనను కూడా నదిలోకి తోసేందుకు రింకు ప్రయత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమె కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు.
ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు స్థానికులు రింకుపై దాడి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు, యమునలో గల్లంతైన చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పీఏసీ డైవర్లను రంగంలోకి దించి నదిలో చిన్నారి ఆచూకీ కోసం శోధిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం చిన్నారి ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది.
భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి రింకును అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి చర్యల వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.ఏడాది వయసున్న పసికందును తండ్రే నదిలోకి విసిరేశాడన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. చిన్నారి కోసం గాలింపు కొనసాగుతుండగా, కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
- YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా
- Telangana Political Row: కేటీఆర్,హరీష్ రావు విడుదల.. రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు..
- Telangana Assembly Session: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు!
- Saudi Arabia’s Water Miracle: నదులు లేకపోయినా కోట్ల మందికి మంచి నీరు ఎలా.. సౌదీ అరేబియా వాటర్ సప్లై వెనుక అసలు రహస్యం..
- Eiffel Tower: ఈఫిల్ టవర్ వద్ద లింగ వివక్ష వివాదం.. మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించడంపై సిబ్బంది ఆగ్రహం..