Skip to content
బిజినెస్ వార్తలు

RRB JE Recruitment 2026: ఆర్‌ఆర్‌బి జేఈ నోటిఫికేషన్ విడుదల…3,993 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ

Prajapaksham 18 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
RRB JE Recruitment 2026: ఆర్‌ఆర్‌బి జేఈ నోటిఫికేషన్ విడుదల…3,993 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ

railway jobs

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) వంటి వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ డ్రైవ్ ద్వారా మొత్తం 3,993 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: ఆగస్టు 13, 2026
  • దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 14, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 13, 2026
  • రుసుము చెల్లింపునకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2026
  • దరఖాస్తు సవరణ (Correction Window): సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 25, 2026 వరకు

మొత్తం ఖాళీలు: 3,993

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ వంటి వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి కేటగిరీల వారీ ఖాళీల వివరాలు:

  • జనరల్: 1,699
  • ఓబీసీ: 913
  • ఎస్సీ: 624
  • ఈడబ్ల్యూఎస్: 394
  • ఎస్టీ: 363

విద్యా అర్హతలు

  • జూనియర్ ఇంజనీర్ (JE): సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా B.E / B.Tech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS): ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ (సెప్టెంబర్ 13, 2026) నాటికి విద్యార్హత ప్రమాణాలను పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం ఫలితాల కోసం వేచి చూస్తున్న వారు అర్హులు కారు.

వయోపరిమితి

జనవరి 1, 2027 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది:

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
  • ఓబీసీ (NCL) అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
  • PwBD, మాజీ సైనికులు, రైల్వే ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

  • దశ 1: మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1)
  • దశ 2: రెండవ విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-2)
  • దశ 3: సర్టిఫికేట్ పరిశీలన (Document Verification)
  • దశ 4: మెడికల్ పరీక్ష (Medical Examination)

పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ అర్హతలను సరిచూసుకుని, సాంకేతిక ఇబ్బందులు ఎదురవకుండా చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ట్యాగ్‌లు: jobs