Skip to content
బిజినెస్ వార్తలు

Gold Rate Today: ఈ రోజు బంగారం ధర పెరిగిందా..?లేక తగ్గిందా..? జూలై 7వ తేదీ, మంగళవారం పసిడి ధరలు ఇవే..

Prajapaksham 06 Jul 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
Gold Rate Today: ఈ రోజు బంగారం ధర పెరిగిందా..?లేక తగ్గిందా..? జూలై 7వ తేదీ, మంగళవారం పసిడి ధరలు ఇవే..

Gold Rate Today: ఈ రోజు బంగారం ధర పెరిగిందా..?లేక తగ్గిందా..? జూలై 7వ తేదీ, మంగళవారం పసిడి ధరలు ఇవే..

బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. జూలై 7వ తేదీ మంగళవారం బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే స్వల్పంగా పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పరిణామాలే కారణం. పసిడి ధరలు గడచిన వారం రోజులుగా తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇప్పుడిప్పుడే బంగారం ధర నెమ్మదిగా కోరుకుంటూ ఇన్వెస్టర్లకు మాత్రం మంచి లాభాలను అందిస్తోంది. అయితే అదే సమయంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మాత్రం పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా బంగారం ఆభరణాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో శ్రావణమాసంలో పెళ్లిళ్ల సీజన్ నాటికి మరింత ఎక్కువగా బంగారం ధర పెరిగే అవకాశం ఉందని పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగారం ధరలను ముందుగానే చెక్ చేసుకుని వెళ్లడం వల్ల మీరు బడ్జెట్ ను వెంటనే సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. ఈ కారణంగానే బంగారం ఆభరణాల మార్కెట్లో బంగారం ధర తెలుసుకొని వెళ్లడం వల్ల లాభదాయకమని చెప్పవచ్చు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,690,
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,850,
వెండి ధర (కిలో) రూ. 2,38,799 గా ఉంది.

విజయవాడ: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,45,955,
22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,400,
వెండి ధర (కిలో) రూ. 2,42,300 గా ఉంది.

రాజమండ్రి: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,46,620
22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,400
వెండి ధర (కిలో) రూ. 2,50,000 గా ఉంది

విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,46,620
22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ. 1,34,400
వెండి ధర (కిలో) రూ. 2,40,000 గా ఉంది.

బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ కారణాలు ప్రధానమైనవి గా చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల విషయంలో ఇంకా ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు బంగారం ఆభరణాలను కొనుగోలు చేసేవారు కూడా పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని తక్కువ మొత్తంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మన వైపు బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది అని చెప్పవచ్చు. అయితే బంగారం ధరలు ప్రస్తుతం మార్కెట్ ధర నుంచి పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వు కనుక వడ్డీరేట్లు పెంచినట్లయితే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ట్యాగ్‌లు: Gold Gold Rate Gold Rate Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *