Skip to content
బిజినెస్ వార్తలు

Gold Rate Today, 23 June 2026: భారీగా తగ్గుతున్న బంగారం ధర…హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత..?

Prajapaksham 22 Jun 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
Gold Rate Today, 23 June 2026: భారీగా తగ్గుతున్న బంగారం ధర…హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత..?

ఈ రోజు బంగారం ధర ఎంత..?

బంగారం ధర నేడు జూన్ 23వ తేదీ, మంగళవారం భారీగా తగ్గింది. తాజా ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం ధర హైదరాబాద్ లో రూ. 151240 పలికింది. అదే సమయంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,100 పలుకుతోంది. వెండి కూడా ఒక కేజీ రూ. 2,43,889 పలుకుతున్నట్లు చూడవచ్చు.

బంగారం ధర గత వారం రోజులుగా గమనించినట్లయితే, తగ్గుతున్నట్లు చూడవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన యుద్ధం వల్ల, ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో తమ పెట్టుబడులను సురక్షితంగా భావించిన బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించారు. రికార్డు స్థాయిలో పెరిగినట్లు చూడవచ్చు. అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ నెల మధ్య నుంచి బంగారం ధరలు తగ్గడం ప్రారంభించాయి.

దీనికి తోడు గుద్ధ వాతావరణం తగ్గడంతో, గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గడం చూడవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కోలుకోవడానికి దారి తీసిన పరిణామంగా చెప్పవచ్చు. అంతేకాదు, ఫలితంగా బంగారం పై ఒత్తిడి కూడా తగ్గి, ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభించాయి. అలాగే అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన యుద్ధ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సప్లై చేయి అవార్ధనాలు ప్రస్తుతం సద్దుమణికి, గ్లోబల్ సప్లై వ్యవస్థ మెరుగుపడుతుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి దోహదపడే అంశంగా చెప్పవచ్చు.

మరోవైపు అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని బలమైన సంకేతాలను ఇచ్చింది. ఇది కూడా బంగారం ధర తగ్గడానికి దోహదం చేసిన ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అలాగే అమెరికా మే నెల కు సంబంధించిన జాబ్స్ డేటాలో అంచనాలకు మించి సానుకూలంగా నాన్ ఫార్మ్ పేరోల్స్ గణాంకాలను రచురణ చేసింది. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఇవి తేల్చాయి. దీంతో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది బంగారం ధర తగ్గడానికి దోహదం చేసే ప్రధాన కారణంగా చెప్పవచ్చుగా, మార్కెట్లో డాలర్ ఇండెక్స్ అనేది చాలా బలపడుతుంది. ఇది ఇతర కరెన్సీలను ఉపయోగించి బంగారం కొనుగోలు చేసే వారిపైన ప్రభావం చూపించి, అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ ను తగ్గిస్తుంది.

మరోవైపు గత మూడు నెలలుగా బంగారం ధర భారీ స్థాయికి చేరుకుంది. ఒక దశలో బంగారం ధర 5589 డాలర్ల వరకు వెళ్లి, ప్రస్తుతం ఏకంగా 1200 డాలర్లు తక్కువగా ట్రేడ్ అవుతోంది. ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గాయని చెప్పవచ్చు. ఇక అంతర్జాతీయంగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన పొదుపుదారులు తమ నిధులను ప్రస్తుతం వెనక్కు తీసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్లో, ఇతర మార్కెట్లలో లాభాలు ప్రారంభం కావడమే అని చెప్పవచ్చు.

అలాగే చైనా, భారత్ వంటి బడా సెంట్రల్ బ్యాంకులు అంతర్జాతీయంగా బంగారం నిలువలను కొనుగోలు చేయడం తగ్గించడం కూడా ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. దీంతో బంగారం డిమాండ్ తగ్గి, ధరలు అందుబాటులో వస్తున్నాయి. మరోవైపు బంగారం ధరలు తగ్గి రావడం అనేది ముఖ్యంగా మహిళలకు ఎంతో ఊరట కల్పించే అంశంగా చెప్పవచ్చు. అయితే బంగారం ధరలు ఎంతవరకు తగ్గుతాయి అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *