Form 7 Explained: ఓటర్ల జాబితాలో పేరు తొలగించాలా.. Form-7తో ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి
Voter Card
Form 7 Explained: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా అర్హత లేని పేర్లను తొలగించడానికి లేదా ఎవరిదైనా పేరు నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి భారత ఎన్నికల సంఘం ‘ఫారమ్-7 (Form 7) ని అందుబాటులోకి తెచ్చింది. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా ఉంచడానికి ఈ ఫారమ్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఫారమ్-7 ఎప్పుడు ఉపయోగించాలి?
మరణించిన ఓటర్ల పేరు తొలగింపు: కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి పేరును జాబితా నుంచి తీసివేయడానికి.
శాశ్వతంగా తరలివెళ్లినవారు (Shifted): వేరే ప్రాంతానికి లేదా విదేశాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లు తొలగించడానికి.
బోగస్ లేదా దొంగ ఓట్లు: ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంటే అభ్యంతరం తెలిపేందుకు.
అర్హత లేని పేర్లు: ఓటరుగా నమోదు కావడానికి చట్టబద్ధమైన అర్హత లేని వారి పేరుపై ఫిర్యాదు చేయడానికి.
ఆన్లైన్లో ఫారమ్-7 ఎలా సమర్పించాలి?
- లాగిన్ అవ్వడం: భారత ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ voters.eci.gov.in లేదా ‘Voter Helpline App’ లో లాగిన్ అవ్వాలి.
- ఫారమ్ ఎంపిక: హోమ్‌పేజీలో ఉన్న”Form 7 – Objection for Proposed Inclusion / Deletion of Name” ను ఎంచుకోవాలి.
- ఎంచుకునే విధానం:
స్వయంగా మీ పేరు తొలగించుకోవాలనుకుంటున్నారా? లేదా
వేరొకరి పేరు తొలగింపు/అభ్యంతరంపై ఫిర్యాదు చేస్తున్నారా? అనేది ఎంచుకోవాలి. - వివరాల నమోదు: ఎవరి పేరునైతే తొలగించాలో వారి EPIC నంబర్ (ఓటరు ఐడీ), సరైన కారణాన్ని (మరణం/చిరునామా మార్పు/దొంగ ఓటు) స్పష్టంగా పేర్కొనాలి.
- మద్దతు పత్రాలు: మరణించిన వారి పేరైతే డెత్ సర్టిఫికెట్ (Death Certificate) అప్లోడ్ చేయడం తప్పనిసరి.
- సబ్మిషన్: వివరాలన్నీ సరిచూసుకుని సబ్మిట్ చేస్తే Reference ID లభిస్తుంది.
అధికారుల పరిశీలన ప్రక్రియ
దరఖాస్తు వచ్చిన వెంటనే అధికారులు ఎలాంటి తొలగింపులు చేపట్టరు.
సంబంధిత నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) దరఖాస్తును పరిశీలిస్తారు.
బూత్ స్థాయి అధికారి (BLO) నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరుపుతారు.
అవసరమైతే సంబంధిత వ్యక్తికి లేదా వారి కుటుంబ సభ్యులకు ముందస్తు నోటీసు జారీ చేసి వివరణ కోరిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు.
అదనపు సమాచారం, దరఖాస్తుల స్థితిని ట్రాక్ చేయడం కోసం ceotelangana.nic.in వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయవచ్చు.
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్