China Gold Strategy: చైనా టన్నుల కొద్దీ బంగారాన్ని ఎక్కడ దాచిపెడుతోందో తెలుసా.. డ్రాగన్ కంట్రీ గోల్డ్ రిజర్వ్‌ల వెనుక అసలు కథ ఇదే..
China Gold News
చైనా తన అధికారిక బంగారం నిల్వలను నిరంతరం పెంచుకుంటూనే ఉంది. 2026 మే నాటికి People’s Bank of China (PBoC) అధికారిక బంగారం నిల్వలను 2,332 టన్నులకు పెంచినట్లు World Gold Council వెల్లడించింది. ఇది వరుసగా 19వ నెల బంగారం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని సూచిస్తోంది.
China Gold Strategy: ప్రపంచ ఆర్థిక రంగంలో, గోల్డ్ వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవడానికి చైనా సంచలన అడుగులు ముందుకు వేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ వెలువరించిన కథనం ప్రకారం.. చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో భద్రపరిచిన తమ భారీ పసిడి నిల్వల్లో ఎక్కువ మొత్తాన్ని హాంకాంగ్‌కు వేగంగా తరలిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు అత్యవసర సమయాల్లో లిక్విడిటీ కోసం, ల్యాండింగ్ అవసరాల కోసం తమ పసిడిని లండన్ లేదా న్యూయార్క్ లాంటి పాశ్చాత్య ఆర్థిక కేంద్రాల్లో నిల్వ ఉంచడం ఆనవాయితీ. అయితే ఇటీవల మారిన భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక ఆంక్షల భయాలు, భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే భారత్, సెర్బియా వంటి దేశాలు తమ నిల్వలను స్వదేశానికి మళ్లించాయి. అదే వ్యూహంతో చైనా కూడా లండన్‌లోని తన బంగారాన్ని ఆసియా పరిధిలోకి.. ముఖ్యంగా హాంకాంగ్‌కు వేగంగా తరలిస్తోంది.
ఈ చర్య ద్వారా హాంకాంగ్‌ను అంతర్జాతీయ పసిడి వాణిజ్య కేంద్రంగా (Global Gold Trading Hub) తీర్చిదిద్దాలని చైనా యోచిస్తోంది. హాంకాంగ్ ఇటీవలే ప్రవేశపెట్టిన గోల్డ్ సెంట్రల్ క్లియరింగ్ సిస్టమ్, నూతన బెంచ్‌మార్క్ ధరల విధానానికి మద్దతుగా చైనా ఈ నిల్వలను సమకూరుస్తోంది. లండన్, న్యూయార్క్, ప్రాంతీయ ప్రత్యర్థి అయిన సింగపూర్ ఆధిపత్యానికి గండి కొడుతూ.. ఆసియా ప్రాంతంలో పసిడి ధరల నిర్ణయ ప్రక్రియలో (Price Discovery) హాంకాంగ్‌ను కీలక శక్తిగా నిలబెట్టడం చైనా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా తన ‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రాజెక్టులోని భాగస్వామ్య దేశాల కేంద్ర బ్యాంకులను కూడా తమ బంగారాన్ని హాంకాంగ్ క్లియరింగ్ వ్యవస్థలో భద్రపరుచుకోవాల్సిందిగా కోరింది. ఇందులో భాగంగా ఇప్పటికే కంబోడియా తమ పసిడి నిల్వలను చైనా వద్ద ఉంచేందుకు అంగీకరించడం గమనార్హం.
పీబీఓసీ (PBOC) ప్రపంచంలోనే అత్యంత భారీగా పసిడిని కొనుగోలు చేసే అధికారిక సంస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. వరుసగా 20 నెలలుగా పసిడిని నిరంతరం కొనుగోలు చేస్తున్న చైనా.. ఇటీవల ఒక్క నెలలోనే అక్టోబర్ 2023 తర్వాత అత్యధిక పరిమాణంలో బంగారాన్ని తమ నిల్వలకు జోడించింది. పిబిఓసి గవర్నర్ పాన్ గోంగ్‌షెంగ్ సైతం హాంకాంగ్‌లో తమ విదేశీ మారక నిల్వలను మరింత పెంచుతామని స్పష్టం చేశారు.
అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. స్వంత విదేశీ మారక నిల్వలను బలోపేతం చేసుకోవడం, యువాన్ (Yuan) కరెన్సీకి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తీసుకురావడమే చైనా చేస్తున్న ఈ భారీ పసిడి తరలింపు వెనుక ఉన్న సంచలన వ్యూహమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- Teachers’ Day 2026 Speech Ideas: నేడు టీచర్స్ డే సందర్భంగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా..అయితే చక్కటి స్పీచ్ మీకోసం..
- Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…
- Happy Teachers Day 2026 Telugu Wishes: మీ బంధుమిత్రులు, స్నేహితులకు టీచర్స్ డే విషెస్ షేర్ చేయండి..
- Happy Teachers Day 2026 Wishes In Telugu: మీ టీచర్లు, స్నేహితులు, బంధు మిత్రులకు Messages, Quotes, Images రూపంలో Whatsapp Status, Facebook కోసం గ్రీటింగ్స్ మీకోసం..
- El Niño 2027 Alert: ప్రపంచానికి పెనుముప్పు తీసుకొస్తున్న చిన్న బాలుడు.. భారీ వర్షాలు, కరువు, తీవ్ర వేడి ముప్పు.. WMO తీవ్ర హెచ్చరిక