AP Local Body Polls: ఏపీ మున్సిపల్ ఎన్నికల వివాదం.. అక్టోబర్ 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు..
Jantar Mantar Violence: జంతర్ మంతర్ హింసపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్.. బాధితులకు అవకాశం..
AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్లో పురపాలక (మున్సిపల్) ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, దాడులు , హింసాత్మక ఘటనలపై అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన రాజ్యాంగ బాధ్యత తమపై ఉందని స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలు నమోదు కాగా, ఒక్క పోలీసు ఫిర్యాదు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం పేర్కొనడంపై ధర్మాసనం మండిపడింది. క్షేత్రస్థాయిలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఉంటే.. భయాందోళనల నడుమ నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు ఎలా ముందుకు వస్తారని కోర్టు ప్రశ్నించింది.
విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో హింసను సృష్టించి ఏకంగా 63.5 శాతం మేర తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికార యంత్రాంగం, ప్రత్యర్థులు అడ్డుకున్నారని వివరించారు. వైఎస్సార్సీపీ నేతలపై భౌతిక దాడులు చేయడమే కాకుండా, బాధితులైన వారిపైనే రివర్స్ కేసులు బనాయించారని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యంలో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ (అన్ని పక్షాలకు సమాన అవకాశం) ఉండాలని, ప్రతిపక్షాలకు నామినేషన్లు వేసే హక్కును కల్పించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎన్నికల వ్యవహారాల్లో కోర్టుల చేతులు కట్టేసి ఉన్నాయన్న వాదనతో తాము ఏకీభవించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘమే (ఎస్ఈసీ) తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గుర్తుచేసింది. హింసకు గురైన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పొడిగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజే తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. బాధితులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లోనే అదనపు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించాలని స్పష్టం చేసింది.
దీనికి తోడు వేధింపులకు గురవుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని సంబంధిత జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 25వ తేదీ వరకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించవద్దని ఎన్నికల సంఘానికి స్పష్టమైన నిబంధన విధించింది. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు, సుప్రీం ఆదేశాల అమలుపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఎస్ఈసీని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.