Hyderabad Jobs: హైదరాబాద్‌లో ఉద్యోగం కంటే సొంతూరి దగ్గరే మేలు.. రెంట్లు, జీవన ఖర్చులు పెరగడంతో నగరానికి దూరమవుతున్న ఉద్యోగార్థులు..
Office Work
సొంతూళ్ల వైపే యువత చూపు
నైపుణ్యాల కొరత, హైదరాబాద్‌లో పెరిగిన జీవన వ్యయమే కారణం!
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఆందోళనకర అంశాలు
రూ. 35 వేలకు మించని జీతాలు
సిలబస్ మార్చేందుకు సిద్ధమవుతున్న ఉన్నత విద్యామండలి
Hyderabad Jobs: డిగ్రీ, ఇంజనీరింగ్ లేదా ఏ ఉన్నత చదువు పూర్తయినా హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేయడం కంటే సొంతూళ్లకు సమీపంలోని పట్టణాల్లోనే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకోవడం మేలనే భావన తెలంగాణ యువతలో వేగంగా పెరుగుతోంది. ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు, హైదరాబాద్‌లో పెరిగిన జీవన వ్యయం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లోపించడమే దీనికి ప్రధాన కారణాలని కేంద్ర కార్మిక శాఖకు చెందిన ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ (PLFS) స్పష్టం చేసింది.
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల టెన్త్, ఇంటర్ పూర్తి కాగానే 15 ఏళ్లు పైబడిన వారిలో 61.4 శాతం మంది తక్షణమే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 66.5%, పట్టణాల్లో 54.1% మంది విద్యార్థులు ఉన్నారు. చిన్న చదువులకే పరిమితమైన వారు స్వగ్రామాలకు 20 కిలోమీటర్ల పరిధిలోనే గరిష్టంగా రూ. 25 వేల వేతనానికి పనిచేస్తున్నారు (వీరిలో పురుషులు 77.1%, మహిళలు 46.4%). 25 ఏళ్లకు పైబడిన యువతలో డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ 73 శాతం మంది రూ. 35 వేలకు మించి సంపాదించలేకపోతున్నారు.
పరిశ్రమలు వేగంగా యాంత్రీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు మళ్లుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ సాంకేతికతపై, అలాగే ఆంగ్ల భాషపై తగిన పట్టు లేకపోవడంతో MNC కంపెనీలు ఆఫర్ చేసే పెద్ద ప్యాకేజీలు (రూ. 15 లక్షల నుండి రూ. 30 లక్షలు) సాధించలేకపోతున్నారు.హైదరాబాద్‌లో ఒక చిన్న గది అద్దెకే కనీసం రూ. 5,000, నెలవారీ ఖర్చులకు రూ. 15,000 దాకా అవుతోంది. పేయింగ్ హాస్టళ్ల (PG) లో ఉంటే రూ. 13,000 వరకు వసూలు చేస్తున్నారు. రూ. 30-35 వేల జీతం వచ్చే యువతకు హైదరాబాద్ వర్క్ సిటీలో మిగిలేది ఏమీ లేకపోవడంతో, ఆందోళన లేని ప్రశాంత జీవితం కోసం సొంత ఊళ్లలోని చిన్న ఉద్యోగాలకే మొగ్గు చూపుతున్నారు. సాంకేతిక విద్య చదివిన వారిలో 67 శాతం మంది రూ. 4.5 నుండి రూ. 7 లక్షల ప్యాకేజీ వచ్చే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) ఉద్యోగాలనే సౌకర్యవంతంగా భావిస్తున్నారు.
- Kaleshwaram Barrages Restoration: కాళేశ్వరం బ్యారేజీలకు నవంబర్‌లో పునరుద్ధరణ పనులు, 2027 వర్షా కాలానికి ముందే పూర్తి..మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటన
- Ambati Rambabu: నారా లోకేష్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి..డీఎస్సీ కేసులపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..
- EC-SIR Row: ఎన్నికల సంఘంపై పెరుగుతున్న వివాదం.. సెప్టెంబర్ 30న INDIA బ్లాక్ కీలక సమావేశం..
- CP Sajjanar Dance Video: సజ్జనార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్.. ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాటకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చిందులు..
- Sircilla Public Meeting: సిరిసిల్లలో రేవంత్ రెడ్డి సభకు భారీ ఏర్పాట్లు.. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ మెగా మీటింగ్