Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

పర్యావరణ ఆరోగ్యమే జీవకోటి సౌభాగ్యం

Prajapaksham 26 Sep 2026 0 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
పర్యావరణ ఆరోగ్యమే జీవకోటి సౌభాగ్యం

World Environmental Health Day

ఐరాస లాంటి పలు అంతర్జాతీయ సంస్థలు నిర్వహించే అతి పెద్ద కార్యక్రమాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ యజ్ఞాన్ని నిరంతరం కొనసాగుతూ మనకు హెచ్చరికలు చేస్తూ వస్తున్నది. పర్సావరణ ఆరోగ్యమే సకల జీవకోటిని సౌభాగ్యమని తెలుసుకొని మన జీవనశైలిని ‘హరిత ఆలోచన’ల వైపు మళ్లిస్తేనే పర్యావరణ కాలుష్యం తగ్గిపోయి మనకే కాకుండా భవిష్యత్తు తరాలకు ఆరోగ్య గొడుగులు పడతాయని తెలుసుకుందాం. పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా అనాలోచిత సాగు పద్దతులు, మైనింగ్‌, ఆటోమొబాల్‌ ఉద్గారాలు, శిలాజ ఇంధనాల ఉద్గారాలు, అటవీ కార్చిచ్చులు, రేడియోధార్మిక పదార్థాలు, మురుగు నీరు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పారిశ్రామికీకరణ, రవాణా, పట్టణీకరణ, భూతా పం, అడవుల నరికి వేత, నిర్మాణ రంగం లాంటి అవాంఛనీయ అంశాలు నిలుస్తున్నాయి. పర్యావరణ కాలుష్యం ఫలితంగా మానవాళి/ప్రాణికోటి అనారోగ్యాలు, జీవ వైవిధ్యానికి విఘాతాలు, వాతావరణ మార్పులు, ఆర్థిక ప్రతికూలతలు, సామాజిక ప్రభావాలు లాంటి పలు దుష్ప్రభాలు కలుగుతున్నాయి. వివిధ రకాల కాలుష్యాల్లో గాలి, నేల, నీటి, శబ్ద, రేడియోధార్మిక, దుమ్ము, ఉష్ణ, విష వాయు, సముద్ర, కాంతి కాలుష్యాలు ప్రధానమైనవని మనకు తెలుసు.
పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం:
26 సెప్టెంబర్‌ 2026న ప్రపంచవ్యాప్తంగా 2011 నుంచి మానవాళి ఘనంగా నిర్వహించుకునే ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం (వరల్డ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ డే) నిర్వహించుకునే వేళ 2025 ఇతివృత్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక ఆరోగ్య సాధనలో వైజ్ఞానిక శాస్త్ర పరిజ్ఞానం (ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ : స్టాండింగ్‌ విత్‌ సైన్స్‌ టు ప్రొటెక్ట్‌ కమ్యూనిటీస్‌) అనబడే అంశాన్ని తీసుకున్నారు. మానవాళి ఆరోగ్య పరిరక్షణతో పాటు శ్రేయస్సు కల్పనకు గాలి కాలుష్యాన్ని కట్టడి చేయడం, వాతావరణ ప్రతికూల మార్పులను తగ్గించడం, శ్వాసకోశ సంబంధ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండడం కొనసాగాలి. గాలి, నేల, జల కాలుష్యాల కు ప్రధాన ప్రమాదకర కారణంగా నిలుస్తున్న ప్లాస్టిక్‌ కాలుష్యంతో భూమాత ఊపిరి పీల్చడం కష్టంగా తోస్తున్నది. ప్లాస్టిక్‌ కాలుష్య కోరల్ని పెకిలించడానికి రీయూజ్‌, రీసైకిల్‌, రెఫ్యూజ్‌, రెడ్యూస్‌, రీథింక్‌ అనే నినాదాలకు కార్యరూపం దాల్చడం మాత్రమే మన ముందున్న ఉత్తమ కర్తవ్యం. ప్లాస్టిక్‌ కాలుష్య దుష్ప్రభావంతో వాతావరణ ప్రతికూల మార్పులు, నేల/ప్రకృతి/జల/జీవ వైవిధ్య సంక్షోభా లు, వ్యర్థాల కాలుష్యం లాంటి ప్రమాదకర సమస్యలు ప్రాణికోటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట 11 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమాతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా యి. నేడు ధరణిలో నెలకొన్న జల నెలవులు, నేలలు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కలుషితం కావడం జరుగుతోంది. నేల లేదా జలాల్లోకి చేరిన ప్లాస్ఠిక్‌ జీవ విచ్ఛిన్నం లేదా డీగ్రేడేషన్‌ కావడానికి వంద ఏండ్లు కూడా పట్టవచ్చని నిపుణులు హెచ్చరించడం గమనార్హం. మన జీవన విధానంలో ప్రతి క్షణం పర్యావరణ హితాన్ని కోరుతూ మన జీవన పయనం కొనసాగించాలి. పర్యావరణ కాలుష్యానికి కారణం కాకుండా మన జీవనశైలిని మార్చుకుంటూనే పౌర సమాజంలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచడం మన కనీస కర్తవ్యంగా భావించాలి. విద్యార్థులు, పాలసీ మేకర్స్‌, తల్లిదండ్రులు, పౌర సమాజం కలిసి పర్యావరణాన్ని కాపాడే మహాయజ్ఞంలో భాగం కావాలి. వాతావరణ పరిశుభ్రతను పాటించి, జల వనరులను వ్యర్థాల నుంచి రక్షించి, మన ఏకైక భూగృహాన్ని కాపాడుకుందాం. మనకు మేలు చేస్తున్న పర్యావరణానికి కీడు తలపెట్టవద్దు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దు.