AP Flood Alert: వీడియో ఇదిగో.. భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో కొట్టుకుపోయిన బ్రిడ్జి.. 75 గ్రామాలకు రాకపోకలు బంద్..
AP Flood Alert
AP Flood Alert: ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు గిరిజన ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చి పొంగిపొర్లుతున్నాయి. వర్షాల తీవ్రతకు జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం వద్ద నిర్మించిన తాత్కాలిక వంతెన నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని దాదాపు 15 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఈ మారుమూల గ్రామాల గిరిజనులు నిత్యావసర సరుకుల రవాణాతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం మండల కేంద్రానికి చేరుకోవడానికి ఈ ఒక్క వంతెనపైనే ప్రధానంగా ఆధారపడి రాకపోకలు సాగిస్తుంటారు. 2024లో సంభవించిన తీవ్ర వర్షాలకు ఇక్కడ ఉన్న ప్రధాన వంతెన ధ్వంసం కాగా, అధికారులు తాత్కాలిక ప్రత్యామ్నాయంగా ఈ చిన్న వంతెనను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న కొండవాగుల వరద తాకిడికి ఆ తాత్కాలిక నిర్మాణం కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంతెన కొట్టుకుపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా మార్గం లేక గిరిజన గ్రామాలు అంధకారంలో పడిపోయాయి. అధికారులు ఇకనైనా తాత్కాలిక పునరుద్ధరణ చర్యలతో సరిపెట్టకుండా, శాశ్వత ప్రాతిపదికన పటిష్టమైన వంతెనను వెంటనే నిర్మించి తమ రాకపోకల కష్టాలను శాశ్వతంగా తీర్చాలని స్థానిక గిరిజన ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- CM Revanth Reddy: 25 ఏళ్ల క్రితమే పుప్పాలగూడ, కోకాపేటను ఏలిన.. రియల్ ఎస్టేట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Aadarsha Kutumbam Teaser: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వచ్చేసింది.. చిట్టిబాబుగా విక్టరీ విశ్వరూపం!
- Botsa Satyanarayana Crying Video: మరోసారి వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స…గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో కంటతడి
- BRICS New Delhi Declaration: UN సంస్కరణల నుంచి ఉగ్రవాదం వరకు.. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కీలక తీర్మానాలు ఇవే..
- CM Revanth Reddy: పాలిటెక్నిక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్… ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు.. అసెంబ్లీలో సీఎం స్పష్టీకరణ