Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

YS Sharmila Daughter Anjali Reddy Marriage: వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు: కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయం

Prajapaksham 06 Sep 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
YS Sharmila Daughter Anjali Reddy Marriage: వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు: కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయం

YS Sharmila Daughter Anjali Reddy Marriage: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబంలో సరికొత్త సంబరం మొదలైంది. ఆమె ఏకైక కుమార్తె వై.ఎస్. అంజలి రెడ్డి వివాహం వైభవంగా జరగబోతోంది. అమెరికాలో నివాసముంటున్న వైద్యుడు డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి నిశ్చితార్థ తాంబూలాలు పూర్తయ్యాయని షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ సంతోషకరమైన ఘట్టం పట్ల దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, కాబోయే దంపతులకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు కావాలని ఆకాంక్షించారు.

వర్జీనియా టు కర్నూలు.. వరుడి నేపథ్యం ఇదే:
కాబోయే అల్లుడి వివరాలను కూడా షర్మిల పంచుకున్నారు. సోమల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడే డాక్టర్ రఘురామ్ రెడ్డి. వీరిది మూలతః ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా అయినప్పటికీ, కుటుంబంతో సహా చాలాకాలంగా అమెరికాలోనే స్థిరపడి యుఎస్ పౌరసత్వం పొందారు. రఘురామ్ ప్రస్తుతం అక్కడ వృత్తిరీత్యా వైద్యసేవలు అందిస్తున్నారు.

ఇటీవలే కుమారుడు రాజా రెడ్డి వివాహాన్ని అట్లూరి ప్రియతో అంగరంగ వైభవంగా జరిపించిన షర్మిల ఇంట, కొన్ని నెలల వ్యవధిలోనే కుమార్తె పెళ్లి కూడా కుదరడంతో వైఎస్ఆర్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు, పెళ్లి ముహూర్తాన్ని త్వరలోనే కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించనుండగా, ఈ పెళ్లి వేడుకలు అమెరికాలోనే నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్‌లు: andhra pradesh YS Sharmila