‘దసరా’కు రానున్న ‘రణబాలి’
Ranabaali
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టి సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘రణబాలి’ సినిమాను ప్రొ డ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి సినిమా రూపొందుతోంది. ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ చేతిలో కత్తితో ఫెరోషియస్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు. రణబాలి రాకతో దసరా బాక్సాఫీస్ మరింత సందడిగా మారనుంది. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్ వోస్లూ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలింస్, కో ప్రొడ్యూసర్స్ అనురాగ్ పర్వతనేని, శివ్ చనన, మ్యూజిక్ అజయ్ అతుల్, డిఒపి నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ, రైటర్ ప్రమోద్ తమ్మినేని ప్రొడక్షన్ డిజైనర్ శివం రావు నాగసాని, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఆర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెంబోలు సాయి ఆదిత్య, కొరియోగ్రఫీ కృతి మహేశ్, కాస్ట్యూమ్ డిజైనర్ అర్చన రావు, ఆర్ట్ డైరెక్టర్ విఠల్ కోసనం, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు.
- Rice Price: సన్నబియ్యం సరఫరాలో అక్రమాల ఆరోపణలు.. ఐదుగురు రైస్ మిల్లర్లను అదుపులోకి తీసుకున్న సీఐడీ
- AP Local Body Elections: ఏపీ పరిషత్ ఎన్నికల్లో 50,815 మంది అభ్యర్థులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ బరిలో పార్టీల వారీగా వివరాలివే..
- Cyclone Arnab Alert: ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. సీఎం చంద్రబాబు సమీక్ష, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..
- Cyclone Arnab: ఏపీ తీరంవైపు ‘అర్ణబ్’ తుపాను.. అక్టోబర్ 28న తీరం దాటే అవకాశం!
- Cyclone Arnab: అర్ణబ్ తుపానుపై ఏపీ సర్కార్ అలర్ట్.. ఐదు రోజుల పాటు అధికారులకు కీలక ఆదేశాలు