సంబరాల ఏటిగట్టు షూటింగ్ పూర్తి-జనవరి 12 రిలీజ్
Sambarala Yeti Gattu
హీరో సాయి దుర్గ తేజ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (ఎస్ వై జీ ) షూటింగ్ మొత్తం పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. విడుదలైన పోస్టర్‌లో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ రఫ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రక్తంతో, గాయాలతో నిండిన శరీరంతో, మంటల్లో చిక్కుకున్న ప్రదేశంలో, చేతిలో ఆయుధం పట్టుకుని టెర్రిఫిక్ కనిపిస్తున్నారు. కాలిపోతున్న కట్టడాలు, పొగ, సంఘర్షణ, హై-వోల్టేజ్ యాక్షన్‌తో నిండిన ప్రపంచాన్ని సూచిస్తున్నాయి.భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రాన్ని అనేక ప్రదేశాలలో, భారీ సెట్లతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ కూడా ఈ తారాగణంలో భాగమై, ప్రముఖ పాత్రలలో కనిపించనున్నారు. వెట్రివేల్ పళనిస్వామి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎడిటర్ నవీన్ విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్, ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, చేతన్, పృథ్వీ.
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్