దేశభక్తి నేపథ్యంలో ‘ది ఇండియన్ బార్డర్’
The Indian Border
ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సిందు తులాని ముఖ్య పాత్రలను పోషించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ దేశ భక్తి గీతాన్ని విడుదల చేశారు.‘జిందా రహేన్ తో డ్యూటీ’ అంటూ దేశభక్తిని రగిల్చేలా ఈ పాట సాగింది. ఇక ఈ పాటకు ఆనంద్ మంత్ర బాణీ, డి.ఎస్. బాషా సాహిత్యం, శరవణ గాత్రం దేశ భక్తి గీతంగా మార్చేసింది. జవాన్ల త్యాగాల్ని, ధైర్య సాహసాల్ని గుర్తు చేసేలా ఈ పాట సాగింది. కె మ్యూజిక్ ఈ మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మేజర్ ఎస్‌పీఎస్ ఒబేరాయ్ మాట్లాడుతూ ‘‘దేశం గురించి, సైన్యం గురించి సినిమా తీయడం ఆనందంగా ఉంది. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటి ఆహారాన్ని తినొద్దు. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’ అని అన్నారు.ఈ కార్యక్రమంలో హీరో, రైటర్ కిరణ్ యార్లగడ్డ , దర్శకుడు డి.ఎస్. బాషా, నిర్మాత నివేద్య రెడ్డి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాం గోపాల్ చౌదరి, కొరియోగ్రాఫర్ రమేష్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ మంత్ర , నలినికాంత్ కొండపల్లి కెమెరామెన్‌గా, కె. రమేష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. హర్నాథ్ సింగులూరి, గౌరి శంకర్ నడిపల్లి పాటలకు సాహిత్యాన్ని అందిస్తున్నారు.